ప్రైవేట్ బడులపై చర్యలు తీసుకోండి
తుర్కయంజాల్: వసంత పంచమి పేరుతో ముందస్తు అడ్మిషన్లు ప్రారంభించిన కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని అఖిల భారత యువజన సమైక్య(ఏఐవైఎఫ్) ఆధ్వర్యంలో బుధవారం జిల్లా విద్యా శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పూర్ణ చంద్రరావును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎప్ జిల్లా కార్యదర్శి పి.శివకుమార్‌గౌడ్ మాట్లాడుతూ.. విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే పండుగల పేర్లను చెప్పి, ప్రజలను సెంటిమెంట్‌తో రెచ్చగొట్టి అడ్మిషన్లు ప్రారంభించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నియమ నిబంధనలు పూర్తిగా విస్మరిస్తూ, ఇష్టారాజ్యంగా సోషల్ మీడియా వేదికగా, భారీ ఫ్లెక్సీలతో పలు పాఠశాలలు ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించాయని గుర్తుచేశారు. వసంత పంచమి పేరుతో జరుగుతున్న అడ్మిషన్ల దందాపై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు హరికృష్ణానాయక్, శివ, వివేక్ తదితరులు పాల్గొన్నారు.
ఏఐవైఎప్ జిల్లా కార్యదర్శి
శివకుమార్‌గౌడ్
వసంత పంచమి పేరుతో
అడ్మిషన్లు చేపడుతున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి– ఏఐవైఎఫ్


