మైసిగండి మైసమ్మ హుండీ @11.03 లక్షలు | - | Sakshi
Sakshi News home page

మైసిగండి మైసమ్మ హుండీ @11.03 లక్షలు

Jan 29 2026 8:33 AM | Updated on Jan 29 2026 8:33 AM

మైసిగ

మైసిగండి మైసమ్మ హుండీ @11.03 లక్షలు

ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక

కడ్తాల్‌: మండల పరిధిలోని మైసిగండి మైసమ్మ దేవత శివరామాలయాలకు సంబంధించిన హుండీ ఆదాయాన్ని బుధవారం జిల్లా దేవాదాయశాఖ తూర్పు విభాగ ఇన్‌స్పెక్టర్‌ ప్రణీత్‌కుమార్‌ సమక్షంలో లెక్కించారు. 59 రోజులకుగాను రూ.11,03,556 ఆదాయం సమకూరింది. ఈ మొత్తాన్ని కెనరా బ్యాంక్‌ కడ్తాల్‌ బ్రాంచ్‌లో డిపాజిట్‌ చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ కార్యక్ర మంలో ఆలయ ఈఓ స్నేహలత, ట్రస్టీ శిరోలీ, నిర్వాహకులు భాస్కర్‌, అరుణ్‌కుమార్‌, చంద్రయ్య, కృష్ణ,రాములు, శ్రీనివాసులు, పత్యానాయక్‌, హర్షవర్ధన్‌ వెంకటేశ్‌, బీబీచారి, శ్రీను, అన్నపూర్ణ సేవా ట్రస్ట్‌ సభ్యులు, కెనరాబ్యాంక్‌ సిబ్బంది పాల్గొన్నారు.

మున్సిపల్‌ ఎన్నికల్లో గిరిజనులకు అన్యాయం

బంజారా భారత్‌ రాష్ట్ర అధ్యక్షుడు హన్మానాయక్‌

కడ్తాల్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల ప్రకారం సముచిత ప్రాతినిథ్యం లభించడం లేదని.. ఈ విషయమై తక్షణమే జోక్యం చేసుకోవాలి బంజారా భారత్‌ రాష్ట్ర అధ్యక్షుడు హన్మానాయక్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన గిరిజన నాయకులతో కలిసి జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యుడు జాటోత్‌ హుస్సేన్‌ నాయక్‌కు హైదరాబాద్‌లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ఆర్టికల్‌ 243–టీ ప్రకారం మున్సిపాలిటీల్లో జనాభా ప్రాతిపదికన ఎస్టీలకు రిజర్వేషన్‌లు కల్పించాల్సి ఉందన్నారు. ప్రస్తుత మున్సిపల్‌ ఎన్నికల్లో చైర్మన్‌, మేయర్‌ పదవులు, వార్డుల కేటాయింపుల్లో గిరిజనులకు అన్యాయం జరుగుతోందని వివరించారు. రాజ్యాంగబద్ధంగా రావాల్సిన వాటాను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు బోనానాయక్‌, హనుమంత్‌నాయక్‌, శంకర్‌నాయక్‌ ఉన్నారు.

బీజేపీకి ‘జుంటుపల్లి’ గుడ్‌బై

తాండూరు టౌన్‌: బీజేపీ జిల్లా కార్యదర్శి జుంటుపల్లి వెంకట్‌ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు జిల్లా కన్వీనర్‌కు లేఖ పంపారు. పార్టీ సిద్ధాంతాలను నమ్మి 18 ఏళ్లుగా ఎనలేని సేవలందించానని, ప్రస్తుతం ఆ పరిస్థితులు తాండూరు నియోజకవర్గంలో కరువయ్యారన్నారు. ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్లు వెంకట్‌ తెలిపారు. మున్సిపల్‌ ఎన్నికల్లో తాను ఎస్సీ జనరల్‌ రిజర్వేషన్‌ ఉన్న 19వ వార్డు నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి

బంట్వారం: దివ్యాంగుల హక్కుల సాధనకు ప్రభుత్వ పరంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలంగాణ దివ్యాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ ముత్తినేని వీరయ్య హామీ ఇచ్చారు. బీవీహెచ్‌పీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి నర్సింలు ఆధ్వర్యంలో పలువురు దివ్యాంగులు బుధవారం నగరంలోని ఆయన్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. బ్యాక్‌లాగ్‌ పోస్టులను వెంటనే భర్తీ చేసేలా చూడాలన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి దివ్యాంగుల సంక్షేమ శాఖగా ఏర్పాటు చేయాలని కోరారు. స్పందించిన వీరయ్య ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

మైసిగండి మైసమ్మ హుండీ @11.03 లక్షలు 
1
1/2

మైసిగండి మైసమ్మ హుండీ @11.03 లక్షలు

మైసిగండి మైసమ్మ హుండీ @11.03 లక్షలు 
2
2/2

మైసిగండి మైసమ్మ హుండీ @11.03 లక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement