పొరపాట్లకు తావివ్వొద్దు
ఇబ్రహీంపట్నం: నామినేషన్ల పరిఽశీలనలో పొరపాట్లకు తావివ్వొద్దని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బుధవారం ఆయన ఎన్నికల పరిశీలకుడు మయాంక్ మిట్టల్‌తో కలిసి ఇబ్రహీంపట్నంలోని నామినేషన్ల స్వీకరణ కేంద్రంలోని ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నామినేషన్ల స్వీకరణ సజావుగా సాగేలా అధికారులు అభ్యర్థులకు సహకరించాలన్నారు. అభ్యర్థికి హెల్ప్ డెస్క్ సిబ్బంది ముందుగానే తగు సూచనలు ఇవ్వాలన్నారు. నామినేషన్ వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేయాలన్నారు. ఆర్వోలు, ఏఆర్వోలు తప్పులు దొర్లకుండా జాగ్రత్తపడాలన్నారు. ప్రవర్తనా నియమావళిలో సందేహలు ఉంటే ఉన్నతాధికారులను దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎన్నికల ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశామని, పోలింగ్, కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ ఇస్తామన్నారు. ప్రత్యేక టీమ్‌లు ఎన్నికల నిర్వహణను పర్యవేక్షిస్తుంటాయని చెప్పారు. రాజకీయ పార్టీలు, ప్రజలు, అభ్యర్థులు ఎన్నికల నిర్వహణకు సహకరించాలన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిస సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీఓ అనంత్‌రెడ్డి, జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి, ఇబ్రహీంపట్నం మండల స్పెషలాఫీసర్ నవీన్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సుదర్శన్ తదితరులున్నారు.
నామినేషన్ల పరిశీలనలో అప్రమత్తంగా ఉండాలి
అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేయాలి
కలెక్టర్ సి.నారాయణరెడ్డి, అబ్జర్వర్ మయాంక్ మిట్టల్


