ఓంకారేశ్వరాలయ భూములను తీసుకోవద్దు
యాచారం: ఓంకారేశ్వరాలయ భూములను పరిశ్రమల పేరుతో తీసుకోవద్దని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. టీజీఐఐసీ ఓంకారేశ్వరాలయానికి చెందిన 1,100 ఎకరాల భూమిని సేకరించడాన్ని ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఆ భూములు సాగు చేసుకుంటున్నా నందివనపర్తి, తాడిపర్తి, కుర్మిద్ద, నస్దిక్‌సింగారం కౌలు రైతులు శుక్రవారం ఇబ్రహీంపట్నంలో మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేవాలయ భూముల జోలికి వెళ్లిన వారు చరిత్రలో బాగుపడిన దాఖలాలు లేవన్నారు. ఆలయ భూముల్లో వందలాది మంది కౌలు రైతులు ఏళ్లుగా సాగు చేసుకుని జీవనోపాధి పొందుతున్నారని, నేడు ఆభూములను సేకరిస్తే వారికి జీవనోపాధి కరువవుతుందన్నారు. కాంగ్రెస్ సర్కార్ వెంటనే ఈ ప్రయత్నాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, యాచారం మండల అధ్యక్షుడు కర్నాటి రమేష్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి పాశ్చ భాషా, నందివనపర్తి మాజీ సర్పంచ్ వర్త్యవత్ రాజునాయక్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి


