పథకాల ఆశచూపి అధికారంలోకి..
కొందుర్గు: తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్న ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను ఆశచూపుతూ అధికారం చేపడుతున్నారని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి విమర్శించారు. మంగళవారం జిల్లేడ్ చౌదరిగూడ మండలం చింతకుంట తండా, వేపకుచ్చ తండా, గోవులబండ తండాలను సందర్శించి గిరిజనుల ఆర్థిక స్థితిగతులు, జీవన నైపుణ్యాలపై ఆరాతీశారు. సాగునీరందక పంటలు ఎండిపోయి అప్పులపాలవుతున్నామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని తీర్చేందుకు ముంబాయి, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వలస పోతున్నామన్నారు. అనంతరం రాఘవాచారి మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని ఓట్లు వేయించుకుని మోసం చేసిందన్నారు. జూరాల నుంచి నీటిని తరలించి లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మిస్తామని చెప్పి ఆరంభంలోనే ప్రాజెక్టును ఆపివేశారని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభు త్వం బీఆర్‌ఎస్ బాటలోనే పాలనసాగిస్తోందన్నా రు. సంక్షేమ పథకాలకే ప్రాధాన్యతనివ్వడం బాధాకరమన్నారు.
లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మిస్తామని బీఆర్‌ఎస్ మోసం
అదేబాటలో కాంగ్రెస్ ప్రభుత్వం
పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి


