ఉచిత పశు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఉచిత పశు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

Jan 30 2026 11:28 AM | Updated on Jan 30 2026 11:28 AM

ఉచిత పశు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

ఉచిత పశు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

మంచాల: గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే ఉచిత పశు వైద్య శిబిరాలను పాడి రైతులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పశు గణాభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్‌ అధికారి డాక్టర్‌ అరుణశ్రీ అన్నారు. మండలంలోని రంగాపూర్‌, చీదేడ్‌ గ్రామాల్లో గురువారం పశుగణాభివృద్ధి శాఖ, పశు సంవర్ధక శాఖ సమన్వయంతో నిర్వహించిన శిబిరానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాడి పశువులకు రోగాలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పశు వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలన్నారు. కార్యక్రమంలో రంగాపూర్‌ సర్పంచ్‌ బాలకృష్ణ, ఉప సర్పంచ్‌ యాదగిరి, మంచాల మండల పశువైద్యాధికారి సుధారెడ్డి, ఆరుట్ల పశు వైద్యాధికారి వనజ, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ అధికారి శ్రీకర్‌రెడ్డి, గోపాలమిత్ర సూపర్‌వైజర్‌ లక్ష్మయ్య, గోపాలమిత్రలు శ్రీను, బాబయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement