బీఆర్‌ఎస్‌ పార్టీ ఇన్‌చార్జిల నియామకం | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ పార్టీ ఇన్‌చార్జిల నియామకం

Jan 25 2026 9:01 AM | Updated on Jan 25 2026 9:01 AM

బీఆర్

బీఆర్‌ఎస్‌ పార్టీ ఇన్‌చార్జిల నియామకం

బీఆర్‌ఎస్‌ పార్టీ ఇన్‌చార్జిల నియామకం రంజాన్‌కు ఆటంకం లేకుండా చూడాలి హైటెన్షన్‌ పనులను నిలిపేసేలా చూడండి

షాద్‌నగర్‌: మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఇన్‌చార్జిలను నియమించింది. షాద్‌నగర్‌ ఇన్‌చార్జిగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైకని శ్రీనివాస్‌ యాదవ్‌, ఆమనగల్లుకు రజిని సాయిచంద్‌, ఇబ్రహీంపట్నంకు నందికంటి శ్రీధర్‌, చేవెళ్లకు సీనియర్‌ నేత కార్తీక్‌రెడ్డి, శంకర్‌పల్లికి కాసాని వీరేష్‌ ముదిరాజ్‌, మొయినాబాద్‌ ఇన్‌చార్జిగా ముఠా జైసింహ, అమృత్‌లాల్‌ చౌహాన్‌ను నియమించారు.

ఇబ్రహీంపట్నం రూరల్‌: రంజాన్‌ మాసంలో ముస్లింలు ఉపవాసం, ప్రార్థనలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకోవాలని అదనపు కలెక్టర్‌ కె.శ్రీనివాస్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శనివారం మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రంజాన్‌ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారిశుద్ధ్యం, తాగునీరు, లైటింగ్‌, భద్రత, మౌలిక సదుపాయలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి నవీన్‌రెడ్డి, ఆర్డీఓ సరిత, అధికారులు, మత పెద్దలు పాల్గొన్నారు.

కడ్తాల్‌: బీదర్‌– మహేశ్వరం పవర్‌గ్రిడ్‌ సంస్థ ఏర్పాటు చేస్తున్న 765 కేవీ హైటెన్షన్‌ విద్యుత్‌ లైన్‌ పనులను మండల కేంద్రంలో తాత్కాలికంగా నిలిపివేసేలా చూడాలని బాధిత రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం కలెక్టర్‌ నారాయణరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ.. బీదర్‌–మహేశ్వరం 765 కేవీ పవర్‌గ్రిడ్‌ సంస్థ పోలీస్‌ బందోబస్తు పెట్టి రేయింబవళ్లు తమ వ్యవసాయ పొలాల్లో హైటెన్షన్‌ లైన్‌ పనులు చేస్తూ తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గత నవంబర్‌లో కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రిని కలిసి తమకు న్యాయం చేయాలని కోరామని, మరోసారి కలిసి సమస్యను పరిష్కరించుకుని వచ్చే వరకు నెల రోజుల పాటు పనులు నిలిపివేయాలని కోరారు. కార్యక్రమంలో బాధిత రైతులు, నాయకులు పాల్గొన్నారు.

లారీ బ్రేక్‌లు ఫెయిల్‌

తప్పిన పెనుప్రమాదం

అబ్దుల్లాపూర్‌మెట్‌: విజయవాడ జాతీయ రహదారిపై అబ్దుల్లాపూర్‌మెట్‌ కూడలిలో శని వారం ఘోర ప్రమాదం తప్పింది. ఓ లారీ బ్రేకులు ఫెయిల్‌ కావడంతో రోడ్డు డివైడర్‌తో పాటు హైమాస్ట్‌ లైట్‌ స్తంభాన్ని ఢీ కొట్టి రోడ్డు మధ్యలో నిలిచిపోయింది. ఎలాంటి ప్రాణన ష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీ ల్చుకున్నారు. వివరాలు.. ఉదయం 11గంటల సమయంలో హైదరాబాద్‌–నల్గొండ మార్గంలో లోడుతో వెళ్తున్న ఓ లారీ అబ్దుల్లాపూర్‌మెట్‌ కూడలి వద్దకు రాగానే బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయి. దీంతో డ్రైవర్‌ రోడ్డు డివైడర్‌తో పాటు విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టడంతో వాహనం రోడ్డు మధ్యలో నిలిచిపోయింది. లారీ ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో ట్రాఫిక్‌ అంతరాయం ఏర్ప డింది. అనంతరం పోలీసులు రంగప్రవేశం చేసి ట్రాఫిక్‌ క్లియర్‌ చేశారు.

బీఆర్‌ఎస్‌ పార్టీ ఇన్‌చార్జిల నియామకం 1
1/1

బీఆర్‌ఎస్‌ పార్టీ ఇన్‌చార్జిల నియామకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement