కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కుమ్మక్కు
శంకర్‌పల్లి: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కుమ్మక్కయ్యాయని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. మున్సిపల్ పరిధిలోని 3, 9, 14 వార్డుల్లో శనివారం సమావేశాలు నిర్వహించి, బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శంకర్‌పల్లిలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఏకమై బీజేపీ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకోవాలని ఒత్తిళ్లు తీసుకొస్తున్నాయని అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ గెలుపును అడ్డుకోలేరన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు దయాకర్‌రెడ్డి, ఎన్నికల ఇన్‌చార్జి అంజన్‌కుమార్, అభ్యర్థులు అనిశెట్టి స్వప్న, భోసే మురళీధర్, వాసుదేవ్ కన్నా, లోకేశ్ తదితరులు పాల్గొన్నారు.
చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి


