ప్రజల భద్రతకు ప్రాధాన్యత
యాచారం: ప్రజల భద్రతే లక్ష్యంగా సర్కార్ పనిచేస్తోందని, ఫ్యూచర్‌సిటీ నిర్మాణంతో ఈ ప్రాంతం భవిష్యత్తులో ప్రపంచస్థాయి గుర్తింపు పొందనుందని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆయన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. హెల్మెట్ ధరించి స్వయంగా బైక్ నడిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి భద్రతకు సర్కార్ ప్రాధాన్యత ఇస్తోందని, అందుకే రాష్ట్ర స్థాయిలో పోలీస్ వ్యవస్థను ప్రజలకు దగ్గరకు తీసుకువచ్చేలా కొత్త కమిషనరేట్లు, పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించాలని, జాగ్రత్తగా ప్రయాణించి ప్రాణాలను కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, యాచారం, గ్రీన్ ఫార్మాసిటీ, ఇబ్రహీంపట్నం, మంచాల సీఐలు నందీశ్వర్‌రెడ్డి, సత్యనారాయణ, మహేందర్‌రెడ్డి, మధు, యాచారం ఎస్‌ఐ మధు, ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గురు నాథ్‌రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి


