ఆలయాలు మరింత అభివృద్ధి చెందాలి
శంకర్‌పల్లి: చెందిప్పలో మరకత శివాలయం, కొత్తగూడెంలోని పాతాళ త్రికోణ మహా సుందరి ఆలయాలు మరింతగా అభివృద్ధి చెందాలని సినీ నటుడు సుమన్ ఆకాంక్షించారు. శుక్రవారం ఆయన ఈ ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయా ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయాల ప్రతిమ, శాలువాలతో సన్మానించారు. నటుడు సుమన్ మాట్లాడుతూ.. కొత్తగూడెంలోని పాతాళ త్రికోణ మహా సుందరి ఆలయం, చెందిప్పలోని మరకత శివాలయాలను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆయన వెంట డబ్బింగ్ ఆర్టిస్ట్ కృష్ణవేణి ఉన్నారు. కార్యక్రమంలో కొత్తగూడెం ఆలయ ధర్మాధికారి మాధవరెడ్డి, చెందిప్ప ఆలయ ధర్మకర్త వీడియో రావు, ఆలయ ప్రచార కమిటీ చైర్మన్ దయాకర్‌రాజు, ఆలయ కమిటీ చైర్మన్ గోపాల్‌రెడ్డి, సభ్యులు సదానందం గౌడ్, శేఖర్, దర్శన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మరకత శివాలయాన్ని సందర్శించిన సినీ నటుడు సుమన్
ఆలయాలు మరింత అభివృద్ధి చెందాలి


