ప్రపంచమంతా ఏఐ | - | Sakshi
Sakshi News home page

ప్రపంచమంతా ఏఐ

Jan 29 2026 8:33 AM | Updated on Jan 29 2026 8:33 AM

ప్రపంచమంతా ఏఐ

ప్రపంచమంతా ఏఐ

యువత, విద్యార్థులు సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకోవాలి

రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డి

ఇబ్రహీంపట్నం: ప్రపంచమంతా డిజిటలైజేషన్‌ వైపు పయనిస్తోందని అందుకు అనుగుణంగా శాస్త్ర సాంకేతిక నైపుణ్యాన్ని, పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ వి.బాలకిష్టారెడ్డి సూచించారు. వికసిత్‌ భారత్‌–2047, డిజిటల్‌ ఇండియా పరివర్తన, సాధికారిత వైపు ఒక చొరవ అనే అంశంపై బుధవారం ఇబ్రహీంపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్‌ రాధిక అధ్యక్షతన జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారిశ్రామిక, వ్యవసాయ, సేవ తదితర రంగాలల్లో డిజిటలైజేషన్‌ మార్కు విస్తృతమైందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాలల్లో పనిచేసే ఉద్యోగులు, విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకోవాలన్నారు. విద్యార్థులు నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించి తమలోని సృజనాత్మకతను వెలికితీయాలన్నారు. ప్రపంచమంతా ఏఐ యుగంలో ఉందన్నారు. ఈ సదస్సులో పరిశోధన పత్రాలతో కూడిన అంతర్జాతీయ జర్నల్‌ను ఆవిష్కరించారు. సుమారు 60 మంది తమ పరిశోధన పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్‌ మల్లయ్య, ప్రొఫెసర్‌ కొండా నాగేశ్వర్‌రావు, సదస్సు కన్వీనర్‌ డాక్టర్‌ ఎస్‌.రమేశ్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సురేశ్‌, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి డాక్టర్‌ డీఎస్‌ఎస్‌ఆర్‌ కృష్ణ, కో కన్వీనర్లు రవికుమార్‌, పవన్‌కుమార్‌, నీలిమ, అధ్యాపకులు రాకేశ్‌భవాని, హృదయరాజు, సురేశ్‌, రచన, నరేందర్‌రెడ్డి, వివిధ వర్సిటీల ఆచార్యులు, అధ్యాపకులు, పరిశోధన విద్యార్థులు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement