కౌలు రైతులకు పట్టాలివ్వాలి
యాచారం: నందివనపర్తి ఓంకారేశ్వరాలయ కౌలు రైతులు శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 60 ఏళ్లకు పైబడి ఆలయ భూములను సాగు చేసుకుని జీవనోపాధి పొందుతున్నామని, ఆ భూములపై రికార్డుల్లోతమ పేర్లు నమోదు చేసి పట్టాదారు, పాసుపుస్తకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫ్యూచర్‌సిటీకి భూములు తీసుకోవాలనే నిర్ణయాన్ని విరమించుకోవాలన్నారు. రైతుల ఆందోళ నకు సీపీఎం మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి పి.యాదయ్య మాట్లాడుతూ.. కౌలు రైతులకు న్యాయం చేయకపోతే సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహ, జిల్లా కమిటీ సభ్యుడు పి.అంజయ్య, కుర్మిద్ద, నస్దిక్‌సింగారం సర్పంచులు నీలం శ్రీవిద్య, బోడ కృష్ణ, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎండీ హఫీజొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.


