యువతి అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

యువతి అదృశ్యం

Jan 31 2026 9:30 AM | Updated on Jan 31 2026 9:30 AM

యువతి అదృశ్యం

యువతి అదృశ్యం

యువతి అదృశ్యం

పహాడీషరీఫ్‌: తండ్రి మందలించడంతో యువతి ఇంటి నుంచి వెళ్లిపోయిన సంఘటన పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మామిడిపల్లి గ్రామానికి చెందిన పబ్బు నారాయణ కుమార్తె మనీష (21) శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తోంది. జాబ్‌ మానేయాలని ఈ నెల 26న తండ్రి మందలించాడు. దీంతో అదేరోజు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లిన ఆమె, హాస్టల్‌లో ఉన్నానని తన సోదరికి రాత్రి మెసేజ్‌ పంపింది. అనంతరం ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేయడంతో ఆమె ఆచూకీ కోసం వెతికినా లాభం లేకుండా పోయింది. ఈ విషయమై ఆమె తండ్రి గురువారం రాత్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు పహాడీషరీఫ్‌ ఠాణాలో గానీ, 87126 62367 నంబర్‌లోగానీ సమాచారం ఇవ్వాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement