టాలెంట్ టెస్టులతో మేథోశక్తి పెంపు
మొయినాబాద్: విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించి మనోవిజ్ఞానాన్ని పెంపొందించేందుకు టాలెంట్ టెస్టులు దోహదపడతాయని ఎస్‌టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోచయ్య అన్నారు. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్‌నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల సాంఘిక శాస్త్రం ఫోరం ఆధ్వర్యంలో విద్యార్థులకు బుధవారం మండల స్థాయి సోషల్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోషల్ టాలెంట్ టెస్ట్ విద్యార్థులకు భవిష్యత్తులో కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కు ఉపయోగపడుతుందన్నారు. ప్రతి సంవత్సరం ఇలాంటి టెస్టులు నిర్వహించి విద్యార్థుల్లో మనో విజ్ఞానాన్ని నింపాలన్నారు. టాలెంట్ టెస్ట్ నిర్వహించిన ఎస్‌ఆర్‌పీలు లలితారెడ్డి, సక్కుబాయ్‌లను అభినందించారు. మొదటి బహుమతి శిరీష, ద్వితీయ బహుమతి హమన్, తృతీయ బహుమతి శ్రీధర్, కన్సల్టేషన్ బహుమతి శాలిని గెలుచుకున్నారు. కార్యక్రమంలో పీఆర్‌టీయూ మండల అధ్యక్షుడు బందయ్య, అసోసియేట్ అధ్యక్షుడు రాములు, ఉపాధ్యాయులు వెంకట్‌రెడ్డి, వినోద్, పద్మ, తుకారాం, రవి, జ్యోతి, విఠల్ తదితరులు పాల్గొన్నారు.


