బస్తా కోసం.. కుస్తీ
యూరియా కోసం రైతులు నానా పాట్లు పడుతున్నారు. ఉదయాన్నే క్యూ లైన్లలో నిలబడి.. టోకెన్లు తీసుకుని గంటల తరబడి నిరీక్షిస్తున్నారు.. ఒక్క బస్తానైనా దొరక్క పోతుందా అని కుస్తీ పడుతున్నారు..
గురువారం మంచాల పీఏసీఎస్ కార్యాలయానికి లోడ్ రాగానే అంతా ఒక్కసారిగా ఎగబడ్డారు. గంటల పాటు ఎదురు చూసినా కొందరికి ఒకే బస్తా దొరకగా.. మరికొంద రికి రిక్త హస్తమే ఎదురైంది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయాన్ని ముట్టడించారు. పోలీసులు సర్దిచెప్పి పంపించారు.
– మంచాల


