నేడు, రేపు జాతీయ సదస్సు
ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధ, గురువారాల్లో జాతీయ సదస్సును నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ రాధిక, సదస్సు కన్వీనర్ రమేశ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. వికసిత్ భారత్–2047 డిజిటల్ ఇండియా, పరివర్తన, సాధికారిత వైపు ఒక చొరవ అనే అంశంపై సదస్సు ఉంటుందున్నారు. దేశంలోని వివిధ వర్సిటీల నుంచి నిష్ణాతులైన అధ్యాపకులు, ఆచార్యులు, పరిశోధక విద్యార్థులు హాజరై పరిశోధన పత్రాలను సమర్పిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డితో పలువురు ప్రముఖులు హాజరవుతున్నట్లు చెప్పారు.
టీపీసీసీ ఓబీసీ సెల్ చైర్మన్‌గా ఎమ్మెల్యే వీర్లపల్లి
షాద్‌నగర్: కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ చైర్మన్‌గా షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ను నియమించారు. ఈ మేరకు మంగళవారం ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులను జారీచేశారు.
ప్రభుత్వ పదవికి రాజీనామా చేసిన గీతావనజాక్షి
మొయినాబాద్: చేవెళ్ల కోర్డులో ప్రభుత్వ అసిస్టెంట్ ప్లీడర్‌గా పనిచేస్తున్న గీతా వనజాక్షి తన పదవికి రాజీనామా చేసి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. మున్సిపల్ పరిధిలోని పెద్దమంగళారం గ్రామానికి చెందిన ఆమె కౌన్సిలర్‌గా పోటీ చేసేందుకు సిద్ధమై చేవెళ్ల కోర్టు న్యాయమూర్తికి రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనకు ప్రభుత్వం అప్పగించిన అసిస్టెంట్ ప్లీడర్ బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తించానన్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే తన పదవికి రాజీనామా చేసి మున్సిపల్ ఎన్నికల బరిలోకి దిగుతున్నానన్నారు. పెద్దమంగళారం సర్పంచ్‌గా పనిచేసిన అనుభవంతో కౌన్సిలర్ బరిలో దిగుతున్నట్లు ప్రకటించారు. గతంలో చేసిన అభివృద్ధి, మంచి పనులను గుర్తించిన గ్రాస్తులు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నానని వివరించారు.
డీఎంహెచ్‌ఓ డాక్టర్ లలితాదేవి
తుక్కుగూడ: పల్లె దవాఖానాలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ లలితాదేవి అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో వైద్య సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 158 పల్లె దవాఖానాలు ఉన్నాయన్నారు. పల్లెల్లో మాతాశిశు సంక్షేమం, కేన్సర్ కేర్, వయో వృద్ధుల సేవలు తదితర కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. అనంతరం వైద్య సిబ్బందికి సిమ్‌కార్డ్స్ అందజేశారు. కార్యక్రమంలో అదనపు డీఎంహెచ్‌ఓ పాపారావు, సిబ్బంది వినోద్, రాకేశ్, శ్రీనివాసులు, అక్రమ్ తదితరులు పాల్గొన్నారు.
కొందుర్గు: గ్రామంలో బెల్ట్‌షాపులు నిర్వహిస్తే సహించేది లేదని కొందుర్గు సర్పంచ్ ప్రభాకర్ హెచ్చరించారు. భగత్‌సింగ్, ఛత్రపతి శివాజీ యువజన సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం సీసాలను విప్పి, పారబోశారు. గ్రామంలో మరోసారి మద్యం విక్రయించినట్లు తెలిస్తే స్థానికులతో కలిసి పోలీసులు, ఎకై ్సజ్ అధికారులకు పట్టించడంతో పాటు కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు.
నేడు, రేపు జాతీయ సదస్సు
నేడు, రేపు జాతీయ సదస్సు
నేడు, రేపు జాతీయ సదస్సు


