స్విమ్మింగ్‌ పూల్‌లో పడి బాలుడి మృతి | - | Sakshi
Sakshi News home page

స్విమ్మింగ్‌ పూల్‌లో పడి బాలుడి మృతి

Feb 10 2026 9:48 AM | Updated on Feb 10 2026 9:48 AM

స్విమ

స్విమ్మింగ్‌ పూల్‌లో పడి బాలుడి మృతి

మొయినాబాద్‌: స్విమ్మింగ్‌ పూల్‌లో పడి ఓ బాలుడు మృతిచెందిన ఘటన మొయినాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి మృగవని రిసార్ట్స్‌లో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. నగరంలోని బాగ్‌లింగంపల్లికి చెందిన ప్రకాశ్‌సింగ్‌ సోమవారం తన కుటుంబ సభ్యులతో కలిసి రిసార్ట్‌లో ఏర్పాటు చేసిన బంధువుల సంగీత్‌ వేడుకకు వచ్చారు. ప్రకాశ్‌సింగ్‌ కుమారుడు సూర్యప్రకాశ్‌(10) ఆడుకుంటూ రిసార్ట్‌లోని స్విమ్మింగ్‌ పూల్‌ వైపు వెళ్లి అందులో పడి నీటమునిగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బయటకు తీసి స్థానిక భాస్కర ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయమై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఇన్‌స్పెక్టర్‌ పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఇదిలా ఉండగా, రిసార్ట్స్‌, ఫాంహౌస్‌లలోని స్విమ్మింగ్‌ పూల్‌లలో ఎలాంటి రక్షణ చర్యలు పాటించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మొయినాబాద్‌ ప్రాంతంలో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా పోలీసులు

స్విమ్మింగ్‌ పూల్‌లో పడి బాలుడి మృతి 1
1/1

స్విమ్మింగ్‌ పూల్‌లో పడి బాలుడి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement