వీ–హబ్‌తో కేఎల్‌హెచ్ ఒప్పందం
మొయినాబాద్: విద్యార్థుల ప్రతిభకు అనుగుణంగా అవకాశాలు కల్పించేందుకు కేఎల్‌హెచ్ యూనివర్సిటీ వీ–హబ్‌తో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సోమవారం యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన ఎంఓయూపై ప్రిన్సిపల్ రామకృష్ణ, వీ–హబ్ ఫౌండేషన్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ సీత పల్లచొళ్ల అధికారికంగా సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రతిభకు అవకాశాలు కల్పించే వాతావరణాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తోందని యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ కోనేరు లక్ష్మణ్ హవిష్ అభిప్రాయపడ్డారు.
ఫాంపాండ్‌ల నిర్మాణంతో నీటి వృథాకు చెక్
కడ్తాల్: ఫాంపాండ్‌ల నిర్మాణంతో నీటి వృథాను అరికట్టవచ్చని సర్పంచ్ సేవ్యానాయక్ అన్నారు. సోమవారం ఆయన గానుగుమార్లతండా పంచాయతీ పరిధిలోని కానుగుబావితండాలలో బీక్యానాయక్ పొలంలో రూ.3 లక్షల ఈజీఎస్ నిధులతో నిర్మిస్తున్న ఫాంపాండ్ నిర్మాణ పనులను ఉప సర్పంచ్ లక్పతినాయక్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈజీఎస్ పనులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రఘుగౌడ్, మాజీ ఉప సర్పంచ్ పాండునాయక్, వార్డు సభ్యులు, నాయకులు శ్రీను, రాజు, శక్రు, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీను తదితరులు ఉన్నారు.
జయంతి వేడుకలను జయప్రదం చేయండి
సేవాలాల్ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్పతినాయక్
కడ్తాల్: గిరిజనుల ఆరాధ్యదైవం, బంజారాల ఆధ్యాత్మిక గురువు సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలను జయప్రదం చేయాలని సేవాలాల్ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జర్పుల లక్పతినాయక్, ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దశరథ్‌నాయక్, సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు నరేశ్‌నాయక్ పిలుపునిచ్చారు. సోమవారం వారు మండల కేంద్రంలోని గిరిజన భవన్‌లో సేవాలాల్ జయంతి వేడుకల నిర్వాహణపై గిరిజన నాయకులతో చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ నెల 15న జయంతి వేడుకలను విజయవంతం కోరారు. శంకర్‌నాయక్, హరిచంద్‌నాయక్, దేవుజానాయక్, పాండునాయక్, జైపాల్‌నాయక్, శ్రీనునాయక్, గణేశ్, నాగార్జున, శ్రీధర్, గోపాల్, కోట్యా, టిక్‌లాల్, స్వామి శివనాయక్, తేజు పాల్గొన్నారు.


