దేశానికి పట్టిన పీడ కాంగ్రెస్‌ | - | Sakshi
Sakshi News home page

దేశానికి పట్టిన పీడ కాంగ్రెస్‌

Feb 7 2026 3:00 PM | Updated on Feb 7 2026 3:00 PM

దేశానికి పట్టిన పీడ కాంగ్రెస్‌

దేశానికి పట్టిన పీడ కాంగ్రెస్‌

● కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

షాద్‌నగర్‌రూరల్‌: దేశానికి పట్టిన పీడ కాంగ్రెస్‌ పార్టీ, తెలంగాణ వెనుకబాటు తనానికి, ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయానికి ప్రధాన కారణం ఆ పార్టీ అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం షాద్‌నగర్‌ పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..రాష్ట్రంలో అవినీతి, దుర్మార్గపు పాలన పోవాలని గత ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేసి అధికారం ఇచ్చారని అన్నా రు. బీఆర్‌ఎస్‌ ఏ రకంగా అవినీతికి పాల్పడిందో అదే విధంగా కాంగ్రెస్‌ పార్టీ పాలన సాగిస్తోందని పేర్కొన్నారు. మూడున్నర లక్షల కోట్లతో రాష్ట్రానికి హై స్పీడ్‌ రైలు కారిడార్‌ రాబోతోందని, ప్రధాని మోదీ ప్రభుత్వం ఒక్క మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే రైల్వే మీద రూ.50 వేల కోట్లు ఖర్చు చేయబోతోందని, ఇందులో షాద్‌నగర్‌ ప్రాంతం భాగస్వామ్యం కాబోతోందని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్‌, రాష్ట్ర అభివృద్ధికి జరుగుతున్నవి కాబట్టి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు శ్రీవర్దన్‌రెడ్డి, అందె బాబయ్య, పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి, కక్కునూరి వెంకటేశ్‌గుప్తా, డాక్టర్‌ విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement