ఎక్స్‌అఫీషియోగా ఎమ్మెల్యే వీర్లపల్లి నమోదు | - | Sakshi
Sakshi News home page

ఎక్స్‌అఫీషియోగా ఎమ్మెల్యే వీర్లపల్లి నమోదు

Feb 16 2026 8:44 AM | Updated on Feb 16 2026 8:44 AM

ఎక్స్

ఎక్స్‌అఫీషియోగా ఎమ్మెల్యే వీర్లపల్లి నమోదు

ఎక్స్‌అఫీషియోగా ఎమ్మెల్యే వీర్లపల్లి నమోదు మా తమ్మున్ని కాంగ్రెసోళ్లు ఎత్కపోయిండ్రు లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ పనులు ప్రారంభించాలి దండుమైలారంలో హైకోర్టు న్యాయమూర్తి పూజలు నుమాయిష్‌కు బైబై

షాద్‌నగర్‌: మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికల ప్రక్రియ పరోక్ష పద్ధతిలో సోమవారం జరగనుంది. షాద్‌నగర్‌ నుంచి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ ఎక్స్‌అఫీషియోగా తన ఓటు హక్కును నమోదు చేసుకున్నట్లు కమిషనర్‌ సునీత తెలిపారు. మున్సిపాలిటీలో 28 వార్డులకు గాను 15 స్థానాల్లో కాంగ్రెస్‌, 11 చోట్ల బీఆర్‌ఎస్‌, 1 బీజేపీ, 1 స్వతంత్రులు గెలుపొందారు. చైర్మన్‌ ఎన్నికకు కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ను కాంగ్రెస్‌ ఇప్పటికే అందుకుంది. ఎమ్మెల్యే ఎక్స్‌అఫీషియోగా నమోదు చేసుకోవడంతో ఆ పార్టీ బలం 16కు చేరింది. దీంతో సునాయసంగా చైర్మన్‌ పీఠాన్ని కై వసం చేసుకుంటుంది.

మొయినాబాద్‌: ‘ఊళ్లో ఇప్పటి వరకు ఇజ్జత్‌తో బతికినం.. మా తమ్ముడికి బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇచ్చింది.. కౌన్సిలర్‌గా గెలిచాడు.. ఇంటికొచ్చి జులూస్‌ చేద్దామనే లోపే నడీ రోడ్డుపై నుంచి మా తమ్మున్ని కాంగ్రెసోళ్ల ఎత్కపోయి మా ఇజ్జత్‌ తీస్తున్నారు. మా తమ్మున్ని మా దగ్గరకు పంపిస్తారా.. లేక మేము ఆత్మహత్య చేసుకోవాలా’ అంటూ 8వ వార్డు కౌన్సిలర్‌ మంచె శంకరయ్య సోదరులు మంచె పోచయ్య, మంచె సత్తయ్య, కుమారుడు మంచె నరేందర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అజీజ్‌నగర్‌లో ఆదివారం మీడియాతో మాట్లాడారు. డబ్బులు ఆశ పెట్టి ఎత్తుకెళ్లడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. వెంటనే పంపిచాలని, లేదంటే కుటుంబ సభ్యులందరం ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.

షాద్‌నగర్‌రూరల్‌: పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా కొందుర్గులో లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్‌ చేస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 18న పట్టణంలోని పెన్షనర్స్‌ భవనంలో సదస్సు నిర్వహిస్తున్నారు. సదస్సుకు సంబంధించిన కరపత్రాలను ఆదివారం ప్రజా సంఘాల నాయకులు మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. రిజర్వాయర్‌ నిర్మిస్తే షాద్‌నగర్‌ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని అన్నారు. పెన్షనర్స్‌ భవనంలో నిర్వహించే సదస్సుకు ప్రొఫెసర్లు హరగోపాల్‌, కోదండరాం, నర్సింహారెడ్డి హాజరవుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు టీజీ శ్రీనివాస్‌, అర్జునప్ప, రవీంద్రనాథ్‌, తిరుమలయ్య, శ్రీకాంత్‌, ఈశ్వర్‌, రాంచందర్‌, సత్యనారాయణ, ప్రీతమ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇబ్రహీంపట్నం: దండుమైలారంలోని ప్రాచీన శివాలయంలో ఆలయ ధర్మకర్తలు రావినూతల వంశీధర్‌ ఆధ్వర్యంలో చండీయాగం నిర్వహించారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గాడి ప్రవీణ్‌కుమార్‌ కుటుంబసభ్యులతో కలసి స్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు.

అబిడ్స్‌: జనవరి 1న నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో ప్రారంభమైన 85వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనశాల (నుమాయిష్‌) ఆదివారం ముగిసింది. 46 రోజుల పాటు కొనసాగిన నుమాయిష్‌లో దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వచ్చిన వస్తువుల ప్రదర్శనతో పాటు విక్రయించారు. చివరి రోజు 75 వేల మంది సందర్శించారని ఎగ్జిబిషన్‌ సొసైటీ ఉపాధ్యక్షుడు ఆర్‌.సుఖేష్‌రెడ్డి, కార్యదర్శి బీఎన్‌ రాజేశ్వర్‌ తెలిపారు. గత ఏడాది 20 లక్షల మంది రాగా.. ఈసారి మొత్తం 23.25 లక్షల మంది సందర్శించారని వారు వివరించారు.

ఎక్స్‌అఫీషియోగా ఎమ్మెల్యే వీర్లపల్లి నమోదు 1
1/2

ఎక్స్‌అఫీషియోగా ఎమ్మెల్యే వీర్లపల్లి నమోదు

ఎక్స్‌అఫీషియోగా ఎమ్మెల్యే వీర్లపల్లి నమోదు 2
2/2

ఎక్స్‌అఫీషియోగా ఎమ్మెల్యే వీర్లపల్లి నమోదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement