ఓట్లు వేయలేదని.. రోడ్డు బంద్‌! | - | Sakshi
Sakshi News home page

ఓట్లు వేయలేదని.. రోడ్డు బంద్‌!

Feb 15 2026 12:34 PM | Updated on Feb 15 2026 12:34 PM

ఓట్లు వేయలేదని.. రోడ్డు బంద్‌!

ఓట్లు వేయలేదని.. రోడ్డు బంద్‌!

షాద్‌నగర్‌ 4వ వార్డులో ఘటన

పోలీసుల జోక్యంతో

సద్దుమనిగిన వివాదం

షాద్‌నగర్‌: ఎన్నికల్లో తమకు ఓటు వేయలేదని ఓ పార్టీకి చెందిన నాయకుడు రాత్రికి రాత్రే కాలనీకి వెళ్లే రోడ్డును పూర్తిగా బంద్‌ చేసిన ఘటన షాద్‌నగర్‌లో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. మున్సిపల్‌ పరిధిలోని 4వ వార్డులో కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసిన మాజీ కౌన్సిలర్‌ రాజేందర్‌రెడ్డి తల్లి పుష్పమ్మ ఓటమి పాలయ్యారు. అయితే వార్డు పరిధిలోని సబ్బులోల్ల కాలనీకి చెందిన వారు తమ కు ఓటు వేయకపోవడంతోనే ఓటమి చెందామని ఆరోపిస్తూ రాజేందర్‌రెడ్డి శుక్రవారం రాత్రి తమ కాలనీకి వచ్చి, రోడ్డుకు అడ్డంగా సిమెంట్‌ పలకలు వేయించి, రహదారిని మూసేశారని కాలనీ వాసు లు తెలిపారు. తమకు ఓట్లు వేయలేదని దౌర్జన్యం చేశారని వాపోయారు. ఈ విషయమై పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసుకులు అక్కడికి చేరుకు ని రోడ్డును క్లియర్‌ చేయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement