వ్యక్తిగత విమర్శలు తగవు
అనంతగిరి: మున్సిపల్ ఎన్నికల్లో వికారాబాద్ పట్టణ ప్రజలు కాంగ్రెస్‌కు అండగా నిలిచారని పార్టీ వికారాబాద్ పట్టణ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మైపాల్‌రెడ్డి అన్నారు. శనివారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో ఇబ్బందులు లేకుండా జరిగాయన్నారు. విజేతలకు అభినందనలు తెలిపారు. రిజర్వేషన్ అనుకూలించడంతో మా పార్టీ నాయకుల కోరిక మేరకు అనన్య వచ్చారన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆనంద్ ఆధారాల్లేని విమర్శలు చేయడం సరికాదన్నారు. స్పీకర్‌పై వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకోవాలన్నారు. వికారాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి పనిచేస్తుందన్నారు. ఇప్పటికే మున్సిపల్‌లో టీయూడీఎఫ్‌సీ కింద రూ.60 కోట్లు, ఎస్‌డీఎఫ్ కింద రూ.18 కోట్లు, హెచ్‌యండీఏ నుంచి రూ.180 కోట్ల నిధులు మంజూరు చేశారన్నారు. సంక్షేమంలో భాగంగా పట్టణంలోని పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారన్నారు. ఈ సమావేశంలో డీసీసీబీ డైరక్టర్ కిషన్‌నాయక్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్‌లు చిగుళ్లపల్లి రమేష్‌కుమార్, సురేష్, కౌన్సిలర్ అనంత్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు షరీఫ్, మాజీ కౌన్సిలర్ మురళి, కిష్టారెడ్డి తదితరులు ఉన్నారు.
కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి


