ఆసక్తిపురం | - | Sakshi
Sakshi News home page

ఆసక్తిపురం

Feb 14 2026 10:05 AM | Updated on Feb 14 2026 10:05 AM

ఆసక్త

ఆసక్తిపురం

శనివారం శ్రీ 14 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

న్యూస్‌రీల్‌

శనివారం శ్రీ 14 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

సాక్షి, రంగారెడ్డిజిల్లా: జిల్లాలోని చేవెళ్ల, శంకర్‌పల్లి, షాద్‌నగర్‌ మున్సిపాలిటీల్లో అధికార కాంగ్రెస్‌ సంపూర్ణ మెజార్టీ సాధించింది. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులను తమ ఖాతాలో వేసుకోగా, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు మున్సిపాలిటీలను ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ కై వసం చేసుకుంది. సంపన్నుల విడిదిగా పేరొందిన మొయినాబాద్‌ మున్సిపాలిటీలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. ఇక్కడ హంగ్‌ అనివార్యమైంది. 26 వార్డుల్లో పది కాంగ్రెస్‌ గెలుచుకోగా, ఏడు బీఆర్‌ఎస్‌ గెలుపొందింది. మరో నాలుగు చోట్ల బీజేపీ విజయం సాధించింది. చైర్మన్‌ పీఠం అధికార పార్టీకి దక్కాలంటే మరో నాలుగు స్థానాలు తప్పనిసరి.

గట్టిపోటీ ఇచ్చిన బీఆర్‌ఎస్‌..

● ఆరు మున్సిపాలిటీల పరిధిలో 126 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించగా మొత్తం 437 మంది బరిలో నిలిచారు. అధికార కాంగ్రెస్‌ పార్టీ 126 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టగా, 54 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, దామోదర రాజనరసింహ, వాకటి శ్రీహరి, సీతక్క సహా స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు స్వయంగా అభ్యర్థుల తరఫున ప్రచారం చేసినా ఆశించిన స్థానాలు గెలుచుకోలేక పోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటర్లకు భారీ మొత్తంలో తాయిలాలు అందజేసినా ఆశించిన ఫలితం దక్కలేదు.

● ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ మొత్తం 122 స్థానాల్లో పార్టీ అభ్యర్థులను నిలబెట్టింది. ఏకంగా 47 మందిని గెలిపించుకుంది. మిగిలిన చోట్ల అధికార కాంగ్రెస్‌కు గట్టిపోటీ ఇచ్చింది. ఇబ్రహీంపట్నంలో గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థి సైతం చివరికి బీఆర్‌ఎస్‌లో చేరడం విశేషం.

● బీజేపీ 109 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, పార్టీ జాతీయ నేతలు అభ్యర్థుల తరఫున ప్రచారం చేసినా ఆశించిన ఫలితాలు సాధించలేక పోయింది. కేవలం 16 స్థానాలతో సరి పెట్టుకోవాల్సి వచ్చింది. అంతేకాదు ఆమనగల్లు సిట్టింగ్‌ చైర్మన్‌ స్థానాన్ని కూడా కోల్పోవాల్సి వచ్చింది.

అధికారపార్టీ క్యాంపులో ఇద్దరు స్వతంత్రులు

మొయినాబాద్‌ మున్సిపాలిటీలో 26 వార్డులు ఉండగా, వీటిలో పది స్థానాలను అధికార కాంగ్రెస్‌ గెలుచుకుంది. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ ఏడు స్థానాల్లో విజయం సాధించగా, బీజేపీ నాలు గు స్థానాల్లో విజయం సాధించింది. స్వతంత్రు లు ఐదు చోట్ల గెలుపొందారు. చైర్మన్‌ పీఠం దక్కాలంటే మ్యాజిక్‌ ఫిగర్‌ 13 స్థానాలు దాటాలి. కాగా కాంగ్రెస్‌కు పది స్థానాలు మాత్రమే దక్కాయి. స్వతంత్రుల్లో కాంగ్రెస్‌ రెబల్స్‌ ఇద్దరు, బీజేపీ రెబల్స్‌ మరో ముగ్గురు ఉన్నారు. ఎలాగైనా చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పీఠాలను దక్కించుకోవాలని అధికార కాంగ్రెస్‌ భావిస్తోంది. ఇప్పటికే గెలుపొందిన అభ్యర్థులను అదే ప్రాంతంలోని మాజీ ఎంపీ ఫాంహౌస్‌లో ఏర్పాటు చేసిన క్యాంపునకు తరలించింది. ఈ క్యాంపులో ఇద్దరు స్వతంత్రులు సైతం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. వారి డిమాండ్లకు అధికార పార్టీ తలొంచినట్లు సమాచారం. ఒక స్వతంత్ర అభ్యర్థికి వైస్‌ చైర్మన్‌ పదవిని ఆఫర్‌ చేయగా, మిగిలిన అభ్యర్థులకు భారీ మొత్తంలో నగదు నజరానా ప్రకటించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.

ప్రధాన పార్టీలతో పాటు ఈ ఎన్నికల్లో ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ రెండు స్థానాల్లో, బీఎస్పీ మూడు స్థానాల్లో, సీపీఐ రెండు, సీపీఎం రెండు స్థానాల్లో పోటీ చేశాయి. ఎంఐఎం ఒకచోట మాత్రమే పోటీ చేసింది. జనసేన ఏకంగా తొమ్మిది స్థానాల్లో బరిలో నిలిచింది. ఇతర పార్టీల నుంచి మరో నలుగురు, స్వతంత్రులు 57 మంది పోటీలో ఉన్నారు. జనసేన, బీఎస్పీ, ఎంఐఎం, సీపీఎం, సీపీఐ సహా ఇతర పార్టీల అడ్రస్‌ గల్లంతైంది. ఏ పార్టీ టికెట్‌ ఇవ్వకపోవడంతో స్వతంత్రులుగా బరిలోకి దిగిన వారిలో ఏకంగా తొమ్మిది మంది విజయం సాధించడం గమనార్హం.

ఉత్కంఠకు తెరపడింది.. పురపోరులో అభ్యర్థుల భవితవ్యం వెల్లడైంది.. అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ హోరాహోరిగా తలపడ్డాయి.. ఫలితాలు సైతం నువ్వానేనా అన్నట్టుగా వచ్చాయి.. అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టించాయి.. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో మూడు చోట్ల హస్తం పార్టీ పై‘చేయి’ సాధించగా.. రెండు చోట్ల ‘కారు’ హవా కొనసాగింది.. మరోచోట హంగ్‌ ఏర్పడి స్వతంత్రులు కింగ్‌మేకర్లుగా మారారు..

ఉత్కంఠ రేపిన ఫలితాలు

చేవెళ్ల, షాద్‌నగర్‌, శంకర్‌పల్లి ‘హస్త’గతం

ఇబ్రహీంపట్నం, ఆమనగల్లులో కారు జోరు

మొయినాబాద్‌లో హంగ్‌.. స్వంత్రులే కింగ్‌ మేకర్లు

వికసించని కమలం, జాడలేని వామపక్షాలు

మున్సిపాలిటీ వార్డులు కాంగ్రెస్‌ బీఆర్‌ఎస్‌ బీజేపీ స్వతంత్రులు

ఆమనగల్లు 15 01 08 06 –

ఇబ్రహీంపట్నం 24 08 13 02 01

షాద్‌నగర్‌ 28 15 11 01 01

శంకర్‌పల్లి 15 09 04 – 02

మొయినాబాద్‌ 26 10 07 04 05

చేవెళ్ల 18 11 04 03 –

మొత్తం 126 54 47 16 9

ఆసక్తిపురం1
1/4

ఆసక్తిపురం

ఆసక్తిపురం2
2/4

ఆసక్తిపురం

ఆసక్తిపురం3
3/4

ఆసక్తిపురం

ఆసక్తిపురం4
4/4

ఆసక్తిపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement