షాద్‌నగర్‌లో అలా.. | - | Sakshi
Sakshi News home page

షాద్‌నగర్‌లో అలా..

Feb 14 2026 10:05 AM | Updated on Feb 14 2026 10:05 AM

షాద్‌నగర్‌లో అలా..

షాద్‌నగర్‌లో అలా..

షాద్‌నగర్‌లో అలా.. బీఆర్‌ఎస్‌ రె‘బెల్‌’ ఎనిమిది ఓట్ల తేడాతో గెలుపు భారీ మెజార్టీలు ఇక్కడే.. అప్పుడు పతులు.. ఇప్పుడు సతులు నాడు తల్లులు.. నేడు కొడుకులు ఆ ముగ్గురూ రెండోసారి కాంగ్రెస్‌ అభ్యర్థి ఆనందభాష్పాలు

షాద్‌నగర్‌ మున్సిపాలిటీపై కాంగ్రెస్‌ జెండా రెపరెపలాడింది. గతంలో రెండు కౌన్సిలర్‌ స్థానాల్లో మాత్రమే విజయం సాధించిన కాంగ్రెస్‌ ఈసారి అత్యధిక స్థానాల్లో విజయం సాధించి మ్యాజిక్‌ ఫిగర్‌ అందుకుంది. 28 వార్డులకు గాను 15 వార్డుల్లో కాంగ్రెస్‌, 11 స్థానాల్లో బీఆర్‌ఎస్‌, 1 బీజేపీ, 1 స్వతంత్రులు గెలుపొందారు. కాంగ్రెస్‌ మున్సిపల్‌ పీఠాన్ని కై వసం చేసుకోనుంది.

పట్టణంలోని 8వ వార్డులో బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి టికెట్‌ రాకపోవడంతో స్వతంత్రంగా బరిలోకి దిగిన సుధీర్‌ 550 ఓట్లు సాధించి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి భిక్షపతిపై 86 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు.

25వ వార్డులో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పెంటయ్య సమీప బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన నక్కల వెంకటేశ్‌గౌడ్‌పై 8 ఓట్ల తేడాతో విజయం సాధించారు. పెంటయ్యకు 501 ఓట్లు పోలవగా, వెంకటేశ్‌కు 493 ఓట్లు వచ్చాయి.

14వ వార్డులో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి అందె మోహన్‌ 673 ఓట్ల మెజార్టీతో ప్రత్యర్థి బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి బచ్చలి నర్సింహపై విజయం సాధించారు. 7వ వార్డులో కాంగ్రెస్‌ అభ్యర్థి కొప్పునూరు ప్రవీణ్‌ 636 ఓట్ల తేడాతో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఈశ్వర్‌ రాజుపై గెలుపొందారు. 3వ వార్డులో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నందారం అశోక్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి రాజుగౌడ్‌పై 546 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు.

గత ఎన్నికల్లో 17వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి గా గెలుపొందిన సర్వర్‌పాషా ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున తన భార్య నాజియా బేగంను గెలిపించుకున్నారు. గతంలో 21వ వార్డు నుంచి జీటీ శ్రీనివాస్‌ గెలుపొందగా, ప్రస్తుత ఎన్నికల్లో ఆయన సతీమణి వసంత విజయం సాధించారు.

గత మున్సిపల్‌ ఎన్నికల్లో 8వ వార్డు నుంచి కాంగ్రెస్‌ తరఫున బీఎస్‌ శాంతమ్మ గెలుపొందగా, ఈసారి ఆమె కుమారుడు బీఎస్‌ సుధీర్‌ స్వంతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. అలాగే 2014 మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి భీమమ్మ గెలుపొందగా ఈసారి ఆమె కొడుకు పెంటయ్య కాంగ్రెస్‌ అభ్యర్థిగా విజయం సాధించారు.

మున్సిపల్‌ పరిధిలోని పలువురు నాయకులు రెండోసారి కౌన్సిలర్లుగా విజయం సాధించారు. 11వ వార్డులో బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసిన పిల్లి శారద, కాంగ్రెస్‌ పార్టీ నుంచి 24వ వార్డులో పోటీచేసిన అగ్గునూరు విశాల, 10వ వార్డు నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన నడికూడ శ్రావణి రెండోసారి గెలుపొందారు.

2వ వార్డులో విజ యం సాధించిన కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి బచ్చలి నరేష్‌ విజయం సాధించ డంతో ఆనందంతో ఆనందభాష్పాలు రాల్చారు. ఆయనకు 924 ఓట్లు రాగా, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి 634 ఓట్లు సాధించారు.

షాద్‌నగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement