చైర్మన్‌గిరిపై సోషల్‌ అలజడి! | - | Sakshi
Sakshi News home page

చైర్మన్‌గిరిపై సోషల్‌ అలజడి!

Feb 15 2026 12:34 PM | Updated on Feb 15 2026 12:34 PM

చైర్మ

చైర్మన్‌గిరిపై సోషల్‌ అలజడి!

ఇబ్రహీంపట్నం: మున్సిపల్‌ ఫలితాల నేపథ్యంలో సోషల్‌ మీడియా వేదికగా బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీ లు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఇబ్రహీంపట్నంలో గెలుపొందిన స్వతంత్ర కౌన్సిలర్‌తో కలిపి బీఆర్‌ఎస్‌కు చెందిన 14 మంది, కాంగ్రెస్‌కు చెందిన 8 మంది అభ్యర్థులు వేర్వేరు క్యాంపుల్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే బీఆర్‌ఎస్‌ శిబిరంలో చైర్మన్‌గిరీపై అలజడి మొదలైందని కాంగ్రెస్‌ శ్రేణులు, హస్తం శిబిరంలో లుకలుకలు ఏర్పడ్డాయని బీఆర్‌ఎస్‌ శ్రేణులు సోషల్‌ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరి శిబిరాలకు సంబంధించిన ఫొటోలను వారు పోస్ట్‌ చేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థులు తమతో టచ్‌లో ఉన్నారని బీఆర్‌ఎస్‌ నాయకులు, బీఆర్‌ఎస్‌ విజేతలు మావైపు వస్తారని కాంగ్రెస్‌ నాయకులు పేర్కొంటున్నారు. అయితే, ఇవన్నీ వదంతులేనని తెలుస్తోంది.

చైర్మన్‌గిరిపై సోషల్‌ అలజడి!1
1/1

చైర్మన్‌గిరిపై సోషల్‌ అలజడి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement