సంక్షేమానికి కేరాఫ్.. కాంగ్రెస్
● ఫ్యూచర్ సిటీ ఏర్పాటుతో ఆమనగల్లుకు మహర్దశ
● రాష్ట్ర పశుసంవర్ధక, కీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి
ఆమనగల్లు: సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని.. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని రాష్ట్ర పశుసంవర్ధక, కీడాశాఖమాత్యులు వాకిటి శ్రీహరి అన్నారు. బుధవారం ఆయన కాంగ్రెస్ అభ్యర్థులు గుర్రం కేశవులు, కృష్ణనాయక్, వస్పుల మానయ్యకు మద్దతుగా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, పీసీసీ సభ్యుడు అయిల శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అర్హులందరికీ సంక్షేమం అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు. పేదలకు సొంతింటి కళ నెరవేర్చామన్నారు. పేదలకు సన్నబియ్యం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి పథకం, వడ్డీలేని రుణాలు అందిస్తున్నామని వివరించారు. ప్రభుత్వం నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీతో ఆమనగల్లు ప్రాంతం ఎంతో అభివృద్ధి చెంతుందని చెప్పారు. ఆమనగల్లు అభివృద్ధికి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహకారంతో ఎమ్మెల్యే కసిరెడ్డి ఆమనగల్లును ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాడన్నారు. ఆమనగల్లులోని 15 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీపీ అనిత, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జగన్, ఏఎంసీ వైస్ చైర్మన్ భాస్కర్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు రవికాంత్‌గౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్‌లు భిక్షపతి, జవహర్‌లాల్‌నాయక్, నాయకులు హన్మానాయక్, గుజ్జల మహేశ్, కొండల్‌రెడ్డి, బొజ్జ సాయిరెడ్డి, వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


