రెండేళ్లలో చేసింది శూన్యం | - | Sakshi
Sakshi News home page

రెండేళ్లలో చేసింది శూన్యం

Feb 6 2026 7:14 AM | Updated on Feb 6 2026 7:14 AM

రెండేళ్లలో చేసింది శూన్యం

రెండేళ్లలో చేసింది శూన్యం

చేవెళ్ల: రెండేళ్ల కాంగ్రెస్‌ పాలనలో ప్రజలకు ఒరింగిందేమీ లేదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి విమర్శించారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఊరెళ్ల, మొండివాగు వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ అభ్యర్థులు దూత మల్లేశ్‌, సువర్ణచందుకు ఓటేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలు పదేళ్ల కేసీఆర్‌ మళ్లీరావాలని కోరుకుంటున్నారన్నారు. మోసపూరిత హామీలు ఇచ్చి గద్దెకెక్కిన కాంగ్రెస్‌కు ప్రజలు ఓటుతో బుద్ధిచెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. చేవెళ్ల గడ్డపై గులాబీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement