ఒడిశా కార్మికులకు విముక్తి
ఇబ్రహీంపట్నం రూరల్: ‘పగలు, రాత్రి తేడా లేకుండా పని చేయించుకుంటూ శ్రమ దోపిడీ చేస్తున్నారు. వీరి ఒత్తిడితో తెలంగాణలో ఉండలేకపోతున్నాం మాకు విముక్తి కల్పించండి’అని ఒడిశా కూలీలు వేడుకున్నారు. ఒడిశాకు చెందిన 14మంది కార్మికులు కుటుంబాలతో కలిసి ఆదిబట్ల సమీపంలో మమ్మరాజిగూడలోని పీవీసీ ఇటుక బట్టీలో పనిచేస్తున్నారు. కొద్ది రోజులుగా నిర్వాహకులు ఇబ్బంది పెడుతున్నారని, రాత్రి 12 గంటల వరకు పనిచేసినా, పొద్దున మూడు గంటలకే నిద్రలేపి నరకం చూపుతున్నారని వాపోయారు. ఈ విషయాన్ని ఒడిశా చెందిన వారికి చెప్పుకోవడంతో పాటు తెలంగాణ డీజీపీ, సీఐడీ, జిల్లా కలెక్టర్, పోలీస్, జాతీయ మానవ హక్కుల సంఘం, ఒడిశా ప్రభుత్వాలకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన అధికారులు, ప్రభుత్వం.. నివేదిక ఇవ్వాలంటూ కలెక్టర్ నారాయణరెడ్డికి ఆదేశాలు అందాయి. దీంతో అక్కడికి వెళ్లిన అధికారులు కార్మికుల వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు వారిని ఆదిబట్ల పీఎస్‌కు తరలించారు. అనంతరం వారి స్వస్థలాలకు పంపించారు.
ఎక్స్‌లో పోస్ట్‌కు స్పందించిన ఉన్నతాధికారులు


