పురవాసుల గొంతెండుతోంది | - | Sakshi
Sakshi News home page

పురవాసుల గొంతెండుతోంది

Feb 4 2026 8:42 AM | Updated on Feb 4 2026 8:42 AM

పురవా

పురవాసుల గొంతెండుతోంది

పురపాలిక సంఘాల్లో తాగునీటి కష్టాలు ప్రజలను పీడిస్తున్నాయి. నిత్యం ఎక్కడో చోట మిషన్‌ భగీరథ నీటి పైపులైన్లు పగలడంతో సరిపడా నీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పన్నులు కట్టేటప్పుడు ముక్కుపిండి వసూలు చేస్తున్న అధికారులు నీటి సమస్య పరిష్కారానికి మాత్రం చొరవ చూపడం లేదని స్థానికులు వాపోతున్నారు. మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా నీటి సమస్యపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

మొయినాబాద్‌: మున్సిపాలిటీలో తాగు నీటి కష్టాలు తీరడంలేదు. మున్సిపల్‌ కేంద్రంలోని పలు కొత్తకాలనీలతోపాటు కొన్ని గ్రామాల్లో బోర్లు, వాటర్‌ ట్యాంకులే ఆధారమవుతున్నాయి. మొయినాబాద్‌లోని భరద్వజ్‌ కాలనీ, సహార కాలనీ, మహబూబ్‌కాలనీ, ముస్తాఫాహిల్స్‌, స్టార్‌ కాలనీ, విజయనగర్‌ కాలనీ, శివానగర్‌ కాలనీ, రాజీవ్‌ గృహకల్ప కాలనీల్లో మిషన్‌ భగీరథ నీళ్లు అందడంలేదు. ఆయా కాలనీలకు మిషన్‌ భగీరథ పైప్‌లైన్లే వేయలేదు. దీంతో అక్కడి ప్రజలంతా బోర్లు, వాటర్‌ ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. హిమాయత్‌నగర్‌లో నిత్యం మిషన్‌ భగీరథ పైప్‌లైన్లు పగులుతుండడంతో నీటి సమస్య తలెత్తుతోంది. వారంలో రెండు మూడుసార్లు స్థానికులు వాటర్‌ ట్యాంకర్లతో నీళ్లు పోయించుకుంటున్నారు. సురంగల్‌, పెద్దమంగళారం, చిలుకూరు, అప్పోజీగూడ, అజీజ్‌నగర్‌, ఎనికేపల్లి, ముర్తూజగూడ గ్రామాల్లో సైతం మిషన్‌ భగీరథ నీళ్లు సరిపోకపోవడంతో బోర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు.

సరిపడా తాగునీరు రాకపోవడంతో ఇబ్బంది

పలుకాలనీలకు అందని

మిషన్‌ భగీరథ నీరు

బోర్లు, వాటర్‌ ట్యాంకులపైనే

ఆధారపడుతున్న ప్రజలు

పట్టించుకోని అధికార యంత్రాంగం

నీళ్లు రావడంలేదు

మిషన్‌ భగీరథ నీళ్లు సరిగా రావడంలేదు. నీళ్లు కొద్దిసేపే వదలడంతో సరిపోవడంలేదు. అవి కూడా రెండు రోజులకోసారి వస్తున్నాయి. నెలలో ఒకటి రెండు సార్లు పైప్‌లైన్లు పగిలిపోతున్నాయి. కాలనీల్లో బోర్ల ద్వారానే నీళ్లు వాడుకునే పరిస్థితి ఉంది. మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోవడంలేదు.

– బాలమణి, సురంగల్‌, మొయినాబాద్‌

పురవాసుల గొంతెండుతోంది 1
1/2

పురవాసుల గొంతెండుతోంది

పురవాసుల గొంతెండుతోంది 2
2/2

పురవాసుల గొంతెండుతోంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement