నిత్యం మూడు లక్షల లీటర్ల కొరత
శంకర్‌పల్లి: మున్సిపాలిటీలో తాగు నీటి సరఫరాకి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం మున్సిపాలిటీ 28 లక్షల లీటర్ల మంచినీరు అవసరం కాగా.. బయట నుంచి ప్రస్తుతం కేవలం 25లక్షల లీటర్ల నీరు మాత్రమే వస్తుంది. మిగిలిన మూడు లక్షల లీటర్లను బోర్లు, ట్యాంకర్ల ద్వారా భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే విధంగా అమృత్ 2.0లో భాగంగా మున్సిపాలిటీకి ఆరు మంచినీటి ట్యాంకులు మంజూరయ్యాయి. అవి నిర్మాణ దశలో ఉన్నాయి. పూర్తయిన తర్వాత శంకర్‌పల్లి మున్సిపాలిటీకి నీటి కష్టాలు తగ్గే అవకాశం ఉంది.


