లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి
కడ్తాల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు దుబ్బ చెన్నయ్య డిమాండ్ చేశారు. ఈ నెల 12న చేపట్టనున్న దేశ వ్యాప్త సమ్మైపె మంగళవారం సీఐటీయూ మండల కన్వీనర్ పెంటయ్య అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చెన్నయ్య మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక చట్టాలు పెట్టుబడిదారి వ్యవస్థకు అనుకూలంగా ఉందన్నారు. కార్మికులు తమ హక్కులు కోల్పోయే విధంగా చట్టాలు రూపొందించారని విమర్శించారు. ఎనిమిది గంటల పని విధానాన్ని ఎత్తేసి, 12 గంటలు అమల్లోకి తెస్తున్నారని చెప్పారు. ఈ లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జీహెచ్‌ఎంసీ, మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, అంగన్‌వాడీ ఆశా, మాధ్యాహ్న భోజన కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. దేశవ్యాప్త సమ్మెలో ప్రతి కార్మికుడు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు జహంగీర్, లక్ష్మమ్మ, మహేశ్, రమేశ్, వీరేశ్, కొండల్, జ్ఞానేశ్వరి, వనిత, లావణ్య, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు చెన్నయ్య


