పరికరాలపై అవగాహన పెంచుకోండి
పరికరాలపై అవగాహన పెంచుకోండి
మొయినాబాద్‌రూరల్: వ్యవసాయ రంగంలో మహిళలు శారీరక శ్రమను తగ్గించే పరికరాలపై అవగాహన పెంచుకోవాలని అఖిల భారత సమన్వయ పరిశోధన స్థానం పీజేటీఏయూ రాజేంద్రనగర్ శాస్త్రవేత్తలు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని అమ్డాపూర్ పంచాయతీ ఆవరణలో మహిళా రైతులకు వ్యవసాయంలో శరీరక శ్రమను తగ్గించే పరికరాలపై లక్ష్మీ చెల్లా, ఝాన్సీ సునీత, డాక్టర్ శ్వేత అవగాహన కల్పించారు. వారు మాట్లాడుతూ.. పురుగు మందును పిచికారీ సమయంలో రైతులు వేసుకునే రక్షణ, దుస్తులు, వాటి ఉపయోగాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణ, మాజీ సర్పంచ్ నర్సింహారెడ్డి, ఉపసర్పంచ్ జితేందర్‌రెడ్డి, పంచాయతీ కారోబార్ ఆర్.గోపాల్‌చారి, నాయకులు ప్రభాకర్‌రెడ్డి, రైతులు శ్రీరాములు, తిరుపతిరెడ్డి, సత్యలింగంగౌడ్, శ్రీను పాల్గొన్నారు.
రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య
సికింద్రాబాద్: వేగంగా వస్తున్న గూడ్స్ రైలుకు ఎదురెళ్లి ఓ వ్యక్తి ఆత్యహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే పోలీస్ సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈఆర్‌పీ హెడ్ కానిస్టేబుల్ కే.నారాయణ తెలిపిన మేరకు.. తమిళనాడు చిదంబరానికి చెందిన ఏ.సుందరమూర్తి (43) సైనిక్‌పురిలోని ఒక ప్రైవేటు కంపెనీలో లీడ్ ఆడిటర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఈనెల 6న మధ్యాహ్నం అమ్ముగూడ–నేరేడ్‌మెట్ రైల్వేస్టేషన్ల మధ్య గూడ్స్ రైలుకు ఎదురెళ్లి ఆత్యహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.