బీజేపీతోనే అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

బీజేపీతోనే అభివృద్ధి

Feb 6 2026 11:45 AM | Updated on Feb 6 2026 11:45 AM

బీజేపీతోనే అభివృద్ధి

బీజేపీతోనే అభివృద్ధి

బీజేపీతోనే అభివృద్ధి దేశం మొత్తం బీజేపీ వైపు

శంకర్‌పల్లి: తెలంగాణలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు కేంద్రం నిధులు ఇస్తుంటే రాష్ట్రం ఇస్తున్నట్లు చెప్పుకోవడం బాధాకరమని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. మున్సిపల్‌ పరిధిలో గురువారం ఆయన బీజేపీ అభ్యర్థుల తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని, మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు ఒక్కటై బీజేపీని ఓడించేందుకు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం, పార్టీ మున్సిపల్‌ అధ్యక్షుడు దయాకర్‌రెడ్డి, నాయకులు ప్రభాకర్‌రెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి, వెంకట్‌రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చేవెళ్ల: మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించుకుంటనే మున్సిలిటీలు అభివృద్ధి చెందుతాయని రాజ్యసభ సభ్యురాలు, ఆ పార్టీ హర్యానా నేత రేఖశర్మ అన్నారు. మున్సిపల్‌ పరిధిలోని 9,10 వార్డుల్లో గురువారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె మాట్లాడారు. దేశం మొత్తం బీజేపీ వైపు ఉందన్నారు. రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం నుంచి పెద్ద మొత్తంలో నిధులు వస్తున్నాయని చెప్పారు. ప్రజలు బీజేపీకి ఓటు వేసి కౌన్సిలర్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం, నాయకులు డాక్టర్‌ మల్గారి వైభవ్‌రెడ్డి, జయశంకర్‌, కౌన్సిలర్‌ అభ్యర్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement