విధుల్లో అలసత్వం సహించేది లేదు | - | Sakshi
Sakshi News home page

విధుల్లో అలసత్వం సహించేది లేదు

Feb 6 2026 11:45 AM | Updated on Feb 6 2026 11:45 AM

విధుల్లో అలసత్వం సహించేది లేదు

విధుల్లో అలసత్వం సహించేది లేదు

శంకర్‌పల్లి: ఎన్నికల విధుల్లో అధికారులు అలసత్వం వహిస్తే సహించేది లేదని, అలాంటివి దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ నారాయణరెడ్డి హెచ్చరించారు. మున్సిపాలిటీలోని పోలింగ్‌ కేంద్రాలు, ఎన్నికల సామగ్రి పంపిణీ, కౌంటింగ్‌, స్ట్రాంగ్‌ రూంలను గురువారం ఎన్నికల పర్యవేక్షకుడు మయాంక్‌ మిట్టల్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. పోలింగ్‌ కేంద్రాల్లో ర్యాంపులు, వెలుతురు సరిగ్గా ఉండేలా లైట్లు, ఇతర సౌకర్యాలను సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. వారివెంట మున్సిపల్‌ కమిషనర్‌ యోగేశ్‌, తహసీల్దార్‌ సురేందర్‌, ఎంపీడీఓ వెంకయ్య, సీఐ శ్రీనివాస్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ నారాయణరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement