ఓటు మీది.. నిధులు తెచ్చే బాధ్యత మాది
చేవెళ్ల: ‘మీరు ఓటు వేసి గెలిపిస్తే.. అభివృద్ధికోసం ముఖ్యమంత్రి ద్వారా నిధులు తెచ్చే బాధ్యత మాది’ అని శాసనమండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని 12, 13, 14, 15,16, 18వ వార్డుల్లో ఆదివారం ఆయన మాజీ ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, పార్టీ నియోజకవర్గం ఇన్‌చార్జి పామెన భీంభరత్‌తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మున్సిపాలిటీల అభివృద్ధికి భారీగా నిధులు అందిస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రకటించారని, మనం కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకొని వెళ్తే చాలు అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు చింపుల సత్యనారాయణరెడ్డి, వీరేందర్‌రెడ్డి, మాణిక్యరెడ్డి, వసంతం, ఎం.బాల్‌రాజ్, దేవర వెంకట్‌రెడ్డి, ఆగిరెడ్డి, గోనే ప్రతాప్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, పెంటయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం
శంకర్‌పల్లి: మున్సిపాలిటీని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, సీఎంతో మాట్లాడి అవసరమైన నిధులు తెస్తామని మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే యాదయ్య అన్నారు. మున్సిపల్ పరిధిలోని ఫత్తేపూర్ 8వ వార్డులో ఆదివారం డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహా రెడ్డి, మాజీ ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి భీంభరత్‌తో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి, ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు ప్రకాశ్, మండల అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి


