ప్రచార జోరు | - | Sakshi
Sakshi News home page

ప్రచార జోరు

Feb 9 2026 8:51 AM | Updated on Feb 9 2026 8:51 AM

ప్రచా

ప్రచార జోరు

సోమవారం శ్రీ 9 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

న్యూస్‌రీల్‌

సోమవారం శ్రీ 9 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
పుర పోరు..

సాక్షి, రంగారెడ్డిజిల్లా: మరికొద్ది గంటల్లో ఎన్నికల ప్రచారం ముగియనుంది. సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ఎక్కడి ప్రచార రథాలు అక్కడే నిలిచిపోనున్నాయి. ఇప్పటి వరకు వీధులు, కాలనీల్లో మార్మోగిన మైకులు మూగబోనున్నాయి. ప్రచారానికి తెరపడనుండటంతో అభ్యర్థులు వేగం పెంచారు. ఉన్న కొద్ది గంటల్లో ఆయా కాలనీలు, అపార్ట్‌మెంట్లను చుట్టేస్తున్నారు. తమకే ఓటు వేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రకరకాల ప్రయత్నాలు సాగిస్తున్నారు. సోమవారం రాత్రి నుంచే పంపకాలకు తెర తీయనున్నారు. పోలింగ్‌ బూతుల వారీగా ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ప్రతి 50 మంది ఓటర్లకు ఒక ఇన్‌చార్జి నియమించి, వారికి కావాల్సినవి సమకూర్చే పనిలో నిమగ్నమయ్యారు. కాగా, మున్సిపల్‌ కేంద్రాల్లో మకాం వేసిన ఇన్‌చార్జిలు, ముఖ్య నేతలు సాయంత్రం 5 తర్వాత మున్సిపాలిటీని విడిచి వెళ్లాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 11న జరిగే పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

2.10 లక్షల బ్యాలెట్‌ పేపర్లు రెడీ

ఒకవైపు రాజకీయ పార్టీలన్నీ ప్రచారంలో మునిగి తేలుతుండగా మరోవైపు ఎన్నికల సంఘం ఓటింగ్‌ ప్రక్రియకు కావాల్సిన ఏర్పాట్లలో నిమగ్నమైంది. 126 వార్డుల్లో 1,75,974 మంది ఓటర్లు ఉండగా, వీరి కోసం 274 పోలింగ్‌ కేంద్రాలను ఎంపిక చేసింది. ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో 500 నుంచి 800 మంది ఓటర్లు ఓటు వేసేలా ఏర్పాట్లు చేసింది. ఎన్నికల నిర్వహణ కోసం 23 మంది జోనల్‌ ఆఫీసర్లు, 18 మంది అధికారులతో ఆరు ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌లు, 63 మంది రిటర్నింగ్‌ అధికారులు, 63 మంది అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్లు, 359 మంది పోలింగ్‌ ఆఫీసర్లు, 359 మంది అసిస్టెంట్‌ పోలింగ్‌ ఆఫీసర్లు, 1,070 మంది పోలింగ్‌ క్లర్క్‌లను ఎంపిక చేసింది. ఇప్పటికే వారికి శిక్షణ ఇచ్చింది. 620 బ్యాలెట్‌ బాక్సులు సహా 2.10 లక్షల బ్యాలెట్‌ పేపర్లు ముద్రించి, ఓటింగ్‌కు సిద్ధంగా ఉంచింది. ఒక్కో వార్డుకు 50 చొప్పున మొత్తం 2,000 పోస్టల్‌ బ్యాలెట్లను రెడీ చేసింది. 11న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనుంది. తొలి రోజు ఓటింగ్‌ వాయిదా పడిన సమస్యాత్మక కేంద్రాల్లో 12న రీపోలింగ్‌ నిర్వహించి, 13న ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తి చేయనుంది. ఇందుకోసం ఆయా మున్సిపాలిటీల్లో ఆరు కౌంటింగ్‌ కేంద్రాలను ఎంపిక చేసింది. కౌంటింగ్‌ కోసం మొత్తం 64 టేబుళ్లను ఏర్పాటు చేయగా, వీటిలో అత్యల్పంగా ఆమనగల్లులో ఐదు, షాద్‌నగర్‌లో 14 సిద్ధం చేసింది. ఓట్ల లెక్కింపు కోసం 254 మంది అధికారులను నియమించింది. మధ్యాహ్నం 2 గంటల్లోగా పూర్తి ఫలితాలు వెల్లడించేలా ఎన్నికల కమిషన్‌ ప్లాన్‌ చేసింది.

ఇబ్రహీంపట్నం ఏసీపీపై ఫిర్యాదు

ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు అందాయి. కాంగ్రెస్‌లో రెబల్స్‌కు సహా ప్రతిపక్ష పార్టీ నేతలకు నేరుగా ఫోన్లు చేసి, రౌడీషీట్‌ ఓపెన్‌ చేయిస్తానంటూ బెదిరింపులకు దిగుతున్నట్లు ఫిర్యాదులు అందాయి. ఈ అంశంపై ఎన్నికల కమి షన్‌ విచారణ చేపట్టనుంది.

నయా నిజాంలా రేవంత్‌రెడ్డి పాలన

వేగం పెంచిన అభ్యర్థులు

కాలనీలు, వీధులు, ఇంటింటినీ చుట్టేస్తున్న నేతలు

నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారపర్వం

మూగబోనున్న మైక్‌లు.. పంపకాలకు సిద్ధం

పోలింగ్‌ ఏర్పాట్లలో ఎన్నికల సంఘం

ప్రచార జోరు1
1/3

ప్రచార జోరు

ప్రచార జోరు2
2/3

ప్రచార జోరు

ప్రచార జోరు3
3/3

ప్రచార జోరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement