ఠాణాకు బ్యాలెట్ బాక్స్‌లు
ఇబ్రహీంపట్నం: మున్సిపల్ ఎన్నికల బ్యాలెట్ పేపర్స్ బాక్స్‌లు ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో గురువారం భద్రపరిచారు. ఈనెల 11న జరిగే ఎన్నికల్లో ఓటర్ల ఈ బ్యాలెట్ పేపర్లలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. దీంతో బాక్స్‌లకు సీల్ వేసి భద్రంగా పోలీస్ కస్టడీలో ఉంచారు. మున్సిపల్ కమిషనర్ సుదర్శన్, సీఐ మహేందర్‌రెడ్డి, ఎన్నికల అధికారుల శ్రీనివాస్‌గౌడ్, లింగం తదితర సిబ్బంది ఉన్నారు.
నేటి నుంచి పోస్టల్ ఓట్లు
మున్సిపల్ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగం శుక్రవారం నుంచి ప్రారంభమవుతోంది. ఎన్నికల విధుల్లో ఉండి వివిధ శాఖల్లో పనిచేసే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ముందస్తుగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. శేరిగూడ సమీపంలోని శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి రోజు శుక్రవారం అక్కడ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం అక్కడి నుంచి మార్చి ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయంలో ఈనెల 10వ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు తెలిపారు.


