గుండెపోటుతో బీటెక్ విద్యార్థి మృతి
ఇబ్రహీంపట్నం: బీటెక్ విద్యార్థి గుండెపోటుతో మృతి చెందిన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. సీఐ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శేరిగూడలోని శ్రీదత్త కళాశాలలో బీటెక్ ఫోర్త్ ఇయర్ చదువుతున్న సాయిగణేశ్(22), ఇదే గ్రామంలోని సాయిసూర్య హాస్టల్ ఉంటున్నాడు. కళాశాల నుంచి హాస్టల్ రూమ్‌కు వచ్చిన విద్యార్థి ఉన్నట్టుండి కిందపడిపోయాడు. గమనించిన రూమ్‌మేట్స్ 108కు ఫోన్ చేసి, వనస్థలిపురం ఏరియా అస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. విద్యార్థి స్వగ్రామం సూర్యాపేట కాగా, అతని తల్లిదండ్రులు మీర్‌పేట్‌లో నివాసం ఉంటున్నట్లు సీఐ తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేశామని వెల్లడించారు.
మతిస్థిమితం లేని వ్యక్తిని
కుటుంబీకులకు అప్పగింత
కడ్తాల్: మానసిక స్థితి సరిగా లేని ఓ వ్యక్తిని గుర్తించిన కడ్తాల్ పోలీసులు కుటుంబ సభ్యులకు మంగళవారం అప్పగించారు. సీఐ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం గుడిబండతండాకు చెందిన బాణవత్ రాంచందర్ ఇటీవల మానసిక పరిస్థితి సరిగా లేక ఇంటి నుంచి వెళ్లిపోయాడు. మండల కేంద్రంలో అన్మాస్‌పల్లి కూడలిలో తిరుగుతున్నాడు. పోలీస్ సిబ్బంది అతన్ని క్షేమంగా పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. వివరాలు సేకరించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో ఆయన్ని అప్పగించారు.


