చెరువు భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు
తుక్కుగూడ: చెరువు శిఖం భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని శంషాబాద్ ఇరిగేషన్ డీఈఈ సతీష్ అన్నారు. మంఖాల్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 614,615లో ఉన్న రాయ్‌కుంట చెరువును శుక్రవారం ఆయ న సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..స్థానికుల ఫిర్యాదు మేరకు చెరువును సందర్శించినట్టు తెలిపారు. శిఖం భూమిలో రియల్టర్లు బయటి నుంచి మట్టి తెచ్చి పోశారని, ఖా ళీ చేయాలని నోటీసులు జారీ చేశామన్నారు. అనంతరం భౌగోళిక సరిహద్దులు నిర్ణయించారు. కార్యక్రమంలో మహేశ్వరం ఏఈ ప్రభాకర్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షుడిగా పాండు
కందుకూరు: ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షుడి గా మండల పరిధిలోని తిమ్మాపూర్‌కు చెందిన మంద పాండు నియ మితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం హర్యా నా మా జీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, హ్యూమన్ రైట్స్ నేషనల్ అధ్యక్షుడు కటకం శ్రీనివాస్ చేతుల మీదుగా నియామకపత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా పాండు మా ట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి పదవీ బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు. మానవ హక్కుల సాధన కోసం తనవంతు కృషి చేస్తానని తెలిపారు.
విధుల్లో అలసత్వం
వహించొద్దు
శంకర్‌పల్లి: బ్యాలెట్ పత్రాలు, బాక్స్‌లను జాగ్రత్తగా ఉపయోగించాలని సహాయ జిల్లా ఎన్నికల అఽధికారి, మున్సిపల్ కమిషనర్ యోగేశ్, ఎన్నికల స్పెషలాఫీసర్ నర్సిరెడ్డి అన్నారు. పట్టణంలోని ఆదర్శ పాఠశాలలో శుక్రవారం ప్రిసైడిండ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు ఎన్నికల విధులపై శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఎన్నికల సామగ్రి తీసుకునేందుకు అధికారులు నిర్ణీత సమయానికి పంపిణీ కేంద్రాలకు చేరుకోవడం, బ్యాలెట్ పత్రాలను ఉపయోగించిన తర్వాత వాటిని భద్రపరిచే విధానాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. విధుల్లో అలసత్వం వహించొద్దని, అలాంటి వారిపై కఠిన చర్యలుంటాయని స్పష్టం చేశారు. ఎన్నికల విధులకు హాజరయ్యే ప్రభుత్వ అధికారుల కోసం మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక పోస్టల్ బ్యాలెట్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
నెలాఖరుకు టిమ్స్
పనుల పూర్తికి వికాస్‌రాజ్ ఆదేశాలు
వెంగళరావునగర్: ఈ నెలాఖరులోగా టిమ్స్ ఆస్పత్రిని అందుబాటులోకి తేవాలని రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్ సూచించారు. వెంగళరావునగర్ డివిజన్ పరిధిలోని తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ఆస్పత్రిని శుక్రవారం ఆయన సందర్శించి మాట్లాడారు. ఎమర్జెన్సీ విభాగానికి అవసరమైన 200 ఆక్సిజన్ లైన్లు, 65 నర్సింగ్ స్టేషన్లు, రిజిస్ట్రేషన్ కౌంటర్లు ఆర్‌ఓ ప్లాంట్ ఏర్పాటు చేసి వెంటనే ట్రయల్ రన్ నిర్వహించాలని సూచించారు. లాండ్రీ సేవలు, కర్టెన్లు, ఐసీయూ, ఎమర్జెన్సీ బెడ్ రెయిలింగులు, సైన్‌బోర్డులు వంటి సహాయక వసతులు సిద్ధం చేయాలన్నారు. ఆయనవెంట వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ నరేంద్రకుమార్, ఆర్‌అండ్‌బీ చీఫ్ ఇంజినీర్ రాజేశ్వర్‌రెడ్డి, ఎస్‌ఈ విశ్వకుమార్, నోడల్ ఆఫీసర్ డాక్టర్ మహబూబ్‌ఖాన్ తదితరులు ఉన్నారు. వచ్చే మార్చిలో టిమ్స్ అందుబాటులోకి రానుండటంతో నగరంలో మరో కీలక ప్రభుత్వ వైద్య సంస్థగా నిలవనుందని, ఈ నెల 12 నుంచి 28 మధ్య తొలిదశలో 100 మంది వైద్య, పారా వైద్య, హౌస్‌కీపింగ్ సిబ్బందిని విధుల్లోకి తీసుకురానున్నట్లు అధికారులు చెప్పారు.
చెరువు భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు
చెరువు భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు


