గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలి | - | Sakshi
Sakshi News home page

గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలి

Feb 6 2026 7:14 AM | Updated on Feb 6 2026 7:14 AM

గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలి

గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలి

మొయినాబాద్‌: మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలంతా పనిచేయాలని శాసన మండలి చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం మొయి నాబాద్‌ మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయం సాధించాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఆరు గ్యారంటీలు, సంక్షేమ పథకాలు పేదలకు అందుతున్న విషయాలను ఇంటింటికి ప్రచారం చేయాలన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పకొట్టాలన్నారు. ఈ నెల 7న పరిగిలో జరిగే సీఎం సభను విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, నియోజకవర్గం ఇన్‌చార్జి భీంభరత్‌, అధికార ప్రతినిధి గౌరి సతీష్‌, పీసీసీ సభ్యుడు షాబాద్‌ దర్శన్‌, పార్టీ మండల అధ్యక్షుడు మాణయ్య, నాయకులు వెంకట్‌రెడ్డి, భాస్కర్‌, రవీందర్‌రెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.

మండలి చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement