కాంగ్రెస్‌, బీజేపీలను ఓడించండి | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌, బీజేపీలను ఓడించండి

Feb 4 2026 8:42 AM | Updated on Feb 4 2026 8:42 AM

కాంగ్రెస్‌, బీజేపీలను ఓడించండి

కాంగ్రెస్‌, బీజేపీలను ఓడించండి

ఆమనగల్లు: మున్సిపాలిటీ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్‌ పార్టీలను ఓడించాలని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌, రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్‌ ఎన్నికల ఇన్‌చార్జి రజనీసాయిచంద్‌ పిలుపునిచ్చారు. ఆమనగల్లు మున్సిపాలిటీ అభివృద్ధి బీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని పేర్కొన్నారు. పట్టణంలో మంగళవారం అభ్యర్థులకు బీఫారాలు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అమలు కాని హామీలతో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమాన్ని విస్మరించి బడా వ్యాపారవేత్తలకు తొత్తుగా మారిందని విమర్శించారు. ఈ ఎన్నికలలో ఓటు అడగడానికి వచ్చే కాంగ్రెస్‌, బీజేపీ నాయకులను ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడు పత్యానాయక్‌, నాయకులు రాము, నిర్మల, దశరథ్‌నాయక్‌, ఎల్‌ఎన్‌రెడ్డి, శ్రీనునాయక్‌, సయ్యద్‌ ఖలీల్‌, నిరంజన్‌గౌడ్‌, జగదీశ్‌, ఆంజనేయులు, జగన్‌, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement