కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం
షాద్‌నగర్: కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర ఫైనా న్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య అన్నారు. పట్టణంలో ని 14వ వార్డులో సోమవారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అందె మోహన్ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. గ్రామాలు, పట్టణాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకు పారదర్శకమైన పాలన అందిస్తూ అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపడుతున్నారన్నారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు అందించడంతో పాటు మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన పాలకులు ప్రజా సమస్యలను పూర్తిగా గాలికి వదిలేసి రాచరికపు పాలన కొనసాగించారని విమర్శించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పారన్నారు. కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి రెండేళ్ల పాలన చూసి ఓటు వేయాలని కోరారు.


