కంప్రెషర్ యూనియన్ అధ్యక్షుడి నియామకం
తుర్కయంజాల్: గ్రేటర్ హైదరాబాద్ కంప్రెషర్ యూనియన్ అధ్యక్షుడిగా కుంచెపు రాజును ఆదివారం ఆదిబట్ల సర్కిల్ పరిధి తొర్రూర్ డివిజన్ కమ్మగూడలోని పూసల భవనంలో తుర్కయంజాల్ వడ్డెర సంఘం అధ్యక్షుడు నర్ర పాండు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కోశిక ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరై నూతనంగా ఎన్నికై న అధ్యక్షుడిని సన్మానించారు. అనంతరం ఐలయ్య మాట్లాడుతూ కంప్రెషర్ వాహనాల యజమానులు ఐకమత్యంతో ఉండాలని సూచించారు. కార్యక్రమంలో వరికుప్పల శేఖర్, మహేష్, వెంకటయ్య, చంద్రయ్య, వెంకటయ్య, కృష్ణ, యాదయ్య, రాంబాబు, శ్రీకాంత్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.


