ఉపాధి కల్పనలో ప్రభుత్వాలు విఫలం | - | Sakshi
Sakshi News home page

ఉపాధి కల్పనలో ప్రభుత్వాలు విఫలం

Feb 9 2026 8:52 AM | Updated on Feb 9 2026 8:52 AM

ఉపాధి కల్పనలో ప్రభుత్వాలు విఫలం

ఉపాధి కల్పనలో ప్రభుత్వాలు విఫలం

తుర్కయంజాల్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో విఫలం అవుతున్నాయని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు ఓరుగంటి యాదయ్య ఆరోపించారు. ఆదివారం గ్రేటర్‌ హైదరాబాద్‌ ఆదిబట్ల సర్కిల్‌ అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్‌) నూతన కార్యవర్గం ఎన్నిక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యాదయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వాలు విద్య, ఉపాధి, ఆరోగ్యం, సామాజిక భద్రత బలోపేతానికి ఎలాంటి విధానాలను అమలు చేయడం లేదన్నారు. దేశ భవిష్యత్‌ అయిన యువతను విస్మరించి దేశాభివృద్ధిని నిర్మించలేమన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికై న సభ్యులను సన్మానించారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి పి.శివకుమార్‌గౌడ్‌, సర్కిల్‌ కార్యదర్శి కాటం రాజు తదితరులు పాల్గొన్నారు.

నూతన కార్యవర్గం

ఏఐవైఎఫ్‌ ఆదిబట్ల సర్కిల్‌ అధ్యక్షుడిగా ఏనుగంటి శ్రీకాంత్‌, ఉపాధ్యక్షులుగా ఓరుగంటి వంశీకృష్ణ, గణేష్‌, మహేష్‌, కార్యదర్శిగా ఎన్‌.రాజుగౌడ్‌, సహాయ కార్యదర్శుగా శివ, వివేక్‌, కార్యవర్గ సభ్యులుగా రాజు, లోకేష్‌, రాహుల్‌నాయక్‌ తదితరులను ఎన్నుకున్నారు.

సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు యాదయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement