నిందితులను శిక్షించాలని కొనసాగుతున్న దీక్ష
చేవెళ్ల: ఇటీవల అడ్వకేట్ స్వప్నను ఆస్తి కోసం సోదరుడు దారుణంగా హత్య చేయించిన సంఘటనలో న్యాయంకోసం కోర్టు ఎదుట న్యాయవాదులు చేస్తున్న రిలే దీక్ష ఆదివారం కూడా కొనసాగుతోంది. ఇందులో బార్ కౌన్సిల్ కంటెస్టింగ్ మెంబర్స్ తేజస్వినిరెడ్డి, జక్కుల వంశీకృష్ణలు పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని కోరారు. దీనికి కారణమైన దీని వెనక ఉన్న వారిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల బార్ అసోసియేషన్ న్యాయవాదులు పాండురంగారెడ్డి, శంసోద్దీన్, బాలస్వామి, సత్యానందం, రాజశేఖర్, ఉదయ్, శివరాజ్, సాయిరాం, ఆనంద్, అభిలాస్‌రెడ్డి, శ్రావణ్, జ్యోతి, విఠల్, వినయ్, సందీప్, రవీందర్, స్నేహ, చందు తదితరులు పాల్గొన్నారు.
ఉచిత వైద్య శిబిరం
షాద్‌నగర్‌రూరల్: ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని బుచ్చిగూడలో మాజీ ఎంపీ శేషయ్య వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం కమ్మ సమైక్య వేదిక అధ్యక్షుడు సాంబశివరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్యశిబిరం విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా మాజీ ఎంపీ శేషయ్యనగర్ కమ్యూనిటీ హాలులో నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలోని వివ ఆస్పత్రి వైద్యులతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్యశిబిరంలో 150 మందికి ఉచితంగా వైద్య పరీక్షలను నిర్వహించి, మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ మల్లేశ్‌గౌడ్, ఉపసర్పంచ్ మహేశ్‌యాదవ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నిందితులను శిక్షించాలని కొనసాగుతున్న దీక్ష


