కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి | - | Sakshi
Sakshi News home page

కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

Feb 7 2026 3:00 PM | Updated on Feb 7 2026 3:00 PM

కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

● పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సారిక చౌదరి

మొయినాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సారిక చౌదరి అన్నారు. మున్సిపల్‌ పరిధిలోని హిమాయత్‌నగర్‌ కంజర్ల మాల్‌లో శుక్రవారం బూత్‌ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె దిశానిర్దేశం చేశారు. అనంతం మాట్లాడుతూ.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి వివరాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేయాలన్నారు. బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలో వివరించాలన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రత్నం, పార్టీ రాష్ట్ర నాయకులు కంజర్ల ప్రకాష్‌, సన్‌వెల్లి ప్రభాకర్‌రెడ్డి, స్థానిక నాయకులు మోర నర్సింహారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, అభ్యర్థులు, బూత్‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement