మాటల్లేవ్..!
ముగిసిన పుర ప్రచారం
రాష్ట్ర ఎన్నికల సంఘం నియమావళిని అనుసరిస్తూ ప్రచార కార్యక్రమాలపై నిషేధం విధించి నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నారాయణరెడ్డి ప్రకటించారు. 48 గంటల సైలెన్స్ పీరియడ్‌లో ఎవరూ బహిరంగ ఎన్నికల ప్రచారం చేయరాదని ఆదేశించారు. ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ, ఎంసీసీ బృందాలు, పోలీసు అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోమవారం సాయంత్రం 5 నుంచి బుధవారం ఎన్నికలు ముగిసే వరకు మద్యం షాపులు, కల్లు దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు ఈనెల 10 నుంచి సెలవు ప్రకటించారు. ఓట్ల లెక్కింపు రోజు 13న ఉదయం 6 గంటల నుంచి లెక్కింపు ప్రక్రియ ముగిసే వరకు మద్యం షాపులు మూసి వేయబడతాయని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ జి.సుధీర్ బాబు ప్రకటించారు.


