రద్దీ ప్రాంతాల్లో దొంగతనాలు | - | Sakshi
Sakshi News home page

రద్దీ ప్రాంతాల్లో దొంగతనాలు

Feb 4 2026 8:42 AM | Updated on Feb 4 2026 8:42 AM

రద్దీ ప్రాంతాల్లో దొంగతనాలు

రద్దీ ప్రాంతాల్లో దొంగతనాలు

రద్దీ ప్రాంతాల్లో దొంగతనాలు

మూసాపేట: మార్కెట్లు, మాల్స్‌, జాతర వంటి రద్దీ ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తున్న ముగ్గురు మహిళలు కూకట్‌పల్లి పోలీసులకు చిక్కారు. ఎస్‌హెచ్‌ఓ కేవీ సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం.. మూసాపేట, ప్రగతినగర్‌కు చెందిన లోపెట్టి నాగమణి గత నెల 13 వ తేదీ రాత్రి స్థానిక మార్కెట్‌లో కూరగాయలు కొనుగోలు చేస్తుండగా గుర్తు తెలియనివ్యక్తులు ఆమె హ్యాండ్‌బ్యాగ్‌ను అపహరించారు. అందులో రూ. 40 వేలు ఉన్నట్లు బాధితురాలు జనవరి 17న పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కూకట్‌పల్లి వై జంక్షన్‌ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఫతేనగర్‌, సనత్‌నగర్‌కు చెందిన బండారి శాలిని(34), గంబు మహేశ్వరి (43), ఉప్పు సరిత(38)లను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. మత్తుకు బానిసలై దొంగతనాలకు పాల్పడుతున్నట్లు వారు విచారణలో అంగీకరించారు. 1,500 నగదును స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్‌కు తరలించారు. అప్పటికే శాలినిపై 7, మహేశ్వరిపై 2, సరితపై 2 కేసులు నమోదై ఉన్నాయి.

ముగ్గురు మహిళల అరెస్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement