సంక్షేమాన్ని చూసి ఓటెయ్యండి
మొయినాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి మున్సిపల్ ఎన్నికల్లో ఓటెయ్యాలని శాసన మండలి చీఫ్‌విప్ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని సురంగల్ 13, 14వ వార్డుల్లో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి చెయ్యిగుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం రెండేళ్లలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించిందన్నారు. మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో అభ్యర్థులు యాలాల లావణ్య, బ్యాగరి రాజు, సీనియర్ నాయకులు రవీందర్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, మోత్కుపల్లి రత్నం, దారెడ్డి కృష్ణారెడ్డి, మాధవరెడ్డి, జంగారెడ్డి, భాస్కరాచారి, విజయభాస్కర్‌రెడ్డి, యాదగిరి చారి తదితరులు పాల్గొన్నారు.


