దేశ వ్యాప్త సమ్మెను విజయవంతం చేయండి
షాద్‌నగర్: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా ఈనెల 12న నిర్వహించ తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాద్యక్షుడు ఎన్.రాజు కోరారు. పట్టణంలోని దేవీ గ్రాండ్ హోటల్‌లో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పండించిన పంటలు అమ్ముకునే పరిస్థితి లేకపోవడంతో రైతులు దివాళా తీస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రంగాన్ని ప్రభుత్వం ప్రోత్సహించాల్సి ఉందన్నారు. కేంద్రం అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను, కార్పొరేట్ అనుకూల పద్ధతులను నిరసిస్తూ సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీను నాయక్, నాయకులు ఈశ్వర్, శ్రీకాంత్, శివ, భుజంగరెడ్డి, రాజు నాయక్, మహ్మద్ బాబు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
యాప్ ద్వారానే
యూరియా పంపిణీ
కందుకూరు: ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా నే రైతులకు యూరియా పంపిణీ జరుగుతుందని జిల్లా వ్యవసాయాధికారి డి.ఉష సూచించారు. మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయంతో పాటు ఫర్టిలైజర్ షాపుల్లో యాప్ ద్వారా చేపట్టిన యూరియా పంపిణీ ప్రక్రియను మంగళవారం ఆమె పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యాప్ ద్వారా రైతులు క్యూకట్టే పద్ధతి, పడిగాపులు కాసే పరిస్థితి ఉండదన్నారు. నిర్ధారించిన పంట ఆధారంగా బుక్ చేసుకుంటే ఐడీ వస్తుందని, దాంతోనే బుక్ చేసుకున్న షాపుకు వెళ్లి 48 గంటల్లోపు కొనుగోలు చేసుకోవచ్చన్నారు. యాప్ ద్వారా బుక్ చేసుకోవడం రాని రైతులు ఏఈ ఓలు లేదా డీలర్ల వద్దకు వెళ్లి అక్కడ ఉండే వలంటీర్ల సాయం తీసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో ఏఓ లావణ్య, రైతులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మల్‌రెడ్డిపై ఫిర్యాదు
ఇబ్రహీంపట్నం: ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అభివృద్ధి పనులను పరిశీలించడం నియమావళిని ఉల్లంఘించడమేనని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఎమ్మెల్యే ప్రయత్నించారని విమర్శించారు. ఈ మేరకు మంగళవారం ఎన్నికల ప్రధాన కమిషనర్, కలెక్టర్, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు.
షర్ఫూద్దీన్ బాబా సేవలో మాజీ మంత్రి సబితా రెడ్డి
పహాడీషరీఫ్: పహాడీషరీఫ్‌లోని బాబా షర్ఫూద్దీన్ దర్గా 760వ ఉర్సులో భాగంగా మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి మంగళవారం పూలు, చాదర్ సమర్పించారు. దర్గాకు విచ్చేసిన ఆమె తలపై బుట్టలో పూలు, చాదర్‌తో వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గా నిర్వాహకులు ఆమెకు ఆశీస్సులు అందజేశారు. ఆమె వెంట నాయకులు షేక్ అఫ్జల్, బర్కత్ అలీ, మక్దూం పటేల్, అబ్బాస్, ఇద్రీస్ తదితరులు ఉన్నారు.
రాత్రిపూట నీటి సరఫరా నివారణకు ప్రత్యేక ప్రణాళిక
సాక్షి, సిటీబ్యూరో: బోరబండ, రహ్మత్‌నగర్‌లలో రాత్రిపూట నీటి సరఫరాతో ప్రజలు పడుతున్న ఇబ్బందుల పరిష్కారానికి రూ.2.5 కోట్లతో ఫీడర్ మెయిన్ పైపులైన్ పనులు చేపట్టినట్లు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి చెప్పారు. మంగళవారం ఎస్పీఆర్ హిల్స్‌లో పైపులైన్ నిర్మాణాన్ని ఆయన పరిశీలించారు. పనుల్లో వేగం పెంచి ఉగాది నాటికి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. నగరంలో రాత్రి వేళల్లో నీటి సరఫరా అయ్యే ప్రాంతాలను గుర్తించి నివేదికలు సమర్పించాలన్నారు. ఉదయం, సాయంత్రం సర ఫరా చేసేలా చూడాలని చెప్పారు.
దేశ వ్యాప్త సమ్మెను విజయవంతం చేయండి
దేశ వ్యాప్త సమ్మెను విజయవంతం చేయండి


